చైనాపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

చైనాపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
x
Donald Trump (File Photo)
Highlights

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టరు.

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టరు. కరోనా వైరస్‌ విషయంలో మరణాల సంఖ్యను చైనా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని, ఎక్కువే ఉంటుందని ఆరోపించారు. కొవిడ్‌-19 వుహాన్‌లో మృతులు సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వుహాన్‌లో సంభవించిన మరణాలు దాదాపు 50 శాతం అంటే 1,290 మరణాలను అదనంగా వెల్లడించారు. దీంతో చైనాలో సంభవించిన మరణాల సంఖ్య ఒకేసారి 40శాతం పెరిగి 4,632కు చేరాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు.

కోవిడ్ విషయంలో అన్ని దేశాలను చైనా అప్రమత్తం చేయడంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం చైనాకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల్ని కూడా నిలిపివేశారు. డబ్ల్యూహెచ్‌ఓ పని తీరుపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ కరోనా వైరస్ మరణాల సంఖ్యను చైనా ఒక్కసారిగా పెంచింది. కోవిడ్19 మృతుల సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది. అమెరికా కంటే కూడా ఎక్కువే ఉంటుంది. మరణాల విషయంలో యూఎస్‌ వారి దరిదాపుల్లోకి కూడా ఉండదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories