జో బైడెన్ కు సవాళ్ళ స్వాగతం!

America New President Joe Biden has more challenges to face
x

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ (పాత చిత్రం)

Highlights

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనకు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏడాదిగా దేశాన్ని చుట్టుముట్టిన సమస్యలు.. బైడెన్‌‌ను ఆహ్వానిస్తున్నాయి.

కరోనా కంట్రోల్‌ కావడం లేదు. వ్యాక్సిన్‌ పంపిణీ సరిగ్గా సాగడం లేదు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనకు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏడాదిగా దేశాన్ని చుట్టుముట్టిన సమస్యలు.. బైడెన్‌‌ను ఆహ్వానిస్తున్నాయి. కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. ఆర్థిక అత్యవసర పరిస్థితి.. దేశంలో భద్రతాపరమైన సమస్యలు.. ట్రంప్‌పై ఇంపీచ్‌మెంట్‌ ప్రక్రియ, ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో సంస్కరణలు, విదేశాలతో సంబంధాల పునరుద్దరణ, వాతావరణ మార్పులు వంటి ఎన్నో అంశాలు బైడెన్‌ ముందున్నాయి. వర్గాలుగా విడిపోయిన అమెరికన్లను ఏకం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రెసిడెంట్‌ బైడెన్‌పై ఉంది.

కరోనా విలయతాండవంతో అమెరికాలో రోజు 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 4వేల మంది చనిపోతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే 10 కోట్ల టీకాల డోసులను అందజేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. కానీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. భారీ స్థాయిలో టీకాలు వేయాలన్నా కాంగ్రెస్‌ నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

ఇక కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అల్లాడుతోంది. ఎకానమీ మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని నెలలుగా అన్‌ఎంప్లాయిమెంట్‌ రేటు 7 శాతం పైనే ఉంది. కరోనా రిలీఫ్‌ ప్యాకేజీ కింద ఒక ట్రిలియన్‌ డాలర్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ను బైడెన్‌ కోరుతున్నారు. ఫెడరల్‌ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్స్‌, చైల్డ్‌కేర్‌ ప్రొవైడర్లకు కూడా నిధులు కోరుతున్నారు బైడెన్‌.

ట్రంప్ హయాంలో ఇమ్మిగ్రేషన్‌ విధానం ఎన్నో విమర్శలకు దారి తీసింది. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇమ్మిగ్రేషన్‌ పాలసీని మారుస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. చట్టపరమైన హోదా లేకుండా దేశంలో ఉంటున్న సుమారు కోటి మందికి పైగా వలసదారులకు పౌరసత్వం ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టాలని బైడెన్‌ భావిస్తున్నారు.

ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ప్రతి దేశంతో కయ్యం పెట్టుకున్నారు. ఇష్టానుసారంగా ఆంక్షలు విధించారు. నార్త్‌ కొరియా, ఇరాన్‌, చైనా సహా ఎన్నోదేశాలు అమెరికాపై ఆగ్రహంతో ఉన్నాయి. నార్త్‌కొరియాతో స్నేహానికి ట్రంప్‌ ప్రయత్నించినా.. అది కుదరలేదు. ఇక చైనాతో ముందు నుంచీ వైరమే. కొన్నిదేశాలు మాత్రమే అమెరికాకు అండగా ఉన్నాయి. విదేశీ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బైడెన్‌దే.

Show Full Article
Print Article
Next Story
More Stories