Gold Card: రోజుకు వెయ్యి కార్డులు అమ్ముతున్నారు.. వేల కోట్లు దండుతున్నారు.. ట్రంప్‌ ప్లాన్‌తో ఇతర దేశాలకు మైండ్ బ్లాక్!

Gold Card
x

Gold Card: రోజుకు వెయ్యి కార్డులు అమ్ముతున్నారు.. వేల కోట్లు దండుతున్నారు.. ట్రంప్‌ ప్లాన్‌తో ఇతర దేశాలకు మైండ్ బ్లాక్!

Highlights

Gold Card: ఓ దేశానికి పౌరసత్వం ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. అలాంటిది పౌరసత్వాన్ని డబ్బుతో కొనేసే ఓ వస్తువుగా మార్చడమేంటి?

America Gold Cards Sale On Peak Confirms Donald Trump Team

Gold Card: ఒక రోజులో 41,500 కోట్లు.. వారంలో 3 లక్షల కోట్లు.. ఏడాదికి 21 లక్షల కోట్లు..! ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా? అమెరికా ఖజానాలో చేరుతున్న, చేరబోయే డబ్బుల లెక్కలు..! అవును...! పౌరసత్వాన్ని వ్యాపారంగా మార్చేసి అమెరికాను అమ్మకానికి పెట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ గోల్డ్‌ కార్డు పేరిట బాగానే డబ్బులు దండుకుంటున్నారు. అమెరికా పౌరసత్వాన్ని ఓ ప్రీమియం ఉత్పత్తిగా మార్చిన ట్రంప్.. గోల్డ్‌ కార్డు ఐడియాతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. గోల్డ్ కార్డ్ పేరుతో రూపొందించిన కొత్త ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్‌ ఇప్పుడు అమెరికాలో అతి పెద్ద వ్యాపారానికి వేదికగా మారింది.

ఒకేరోజులో 1,000 కార్డులు అమ్మినట్టు అమెరికా కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఒక్కో కార్డుకు 41.5 కోట్లు అంటే.. ఒక్కరోజులో 41,500 కోట్లు వచ్చినట్టు లెక్క. అమెరికా అప్పులను పూడ్చడానికి ఈ డబ్బులను ఉపయోగించనున్నారట. ట్రంప్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది గోల్డ్ కార్డ్ కొనగలిగే స్థితిలో ఉన్నారు. అందులో కనీసం 10 లక్ష మంది గోల్డ్‌ కార్డు కొంటారని ట్రంప్‌ సర్కార్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక గోల్డ్ కార్డ్ అనేది ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇన్వెస్టర్ వీసా స్కీమ్. ఇప్పటివరకు ఉన్న EB-5 వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా పక్కకు నెట్టి ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ట్రంప్‌. ఈ స్కీమ్‌ ద్వారా దాదాపు 41.5 కోట్లను చెల్లించి అమెరికాలో శాశ్వత నివాస హక్కును పొందవచ్చు. శాశ్వత నివాసం పొందిన తర్వాత స్వేచ్ఛగా అమెరికాలోనే నివసించవచ్చు.. బిజినెస్‌ కూడా చేసుకోవచ్చు.. అంతేకాదు పిల్లలకు ఎడ్యుకేషన్‌ బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రీన్‌ కార్డు ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ గోల్డ్‌ కార్డు ద్వారా వస్తాయి.

ఇక గతంలో EB-5 స్కీమ్‌లో చేరాలంటే 8.3 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. అంతేకాదు కనీసం 8 ఉద్యోగాలైనా సృష్టించాలి. కొన్ని రూల్స్ పాటించాలి. మీకు బిజినెస్‌ స్కిల్‌, టాలెంట్‌ ఉంటేనే EB-5 వీసా ప్రోగ్రామ్‌ దరఖాస్తుకు అర్హత ఉంటుంది. ఇటు ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్‌లో అలాంటివి ఏమీ ఉండవు. డబ్బు చెల్లిస్తే చాలు.. ఎవరికైనా గోల్డ్‌ కార్డు ఇచ్చేస్తారు. మరోవైపు గోల్డ్ కార్డ్ దరఖాస్తుదారుల వెరిఫికేషన్ కోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ని మస్క్ టీమ్‌ రూపొందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories