భార‌తీయుల‌కు గుడ్ న్యూస్.. హెచ్‌-1బి వీసా గడుపు పెంపు

భార‌తీయుల‌కు గుడ్ న్యూస్.. హెచ్‌-1బి వీసా గడుపు పెంపు
x
Highlights

కరోనా వైరస్‌ మహమ్మారి కార‌ణంగా అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది భారతీయులకు ఊరట లభించింది.

కరోనా వైరస్‌ మహమ్మారి కార‌ణంగా అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది భారతీయులకు ఊరట లభించింది. హెచ్‌-1బి వీసా వ‌చ్చిన వారు మరికొంత కాలం ఉండేందుకు దరఖాస్తులు స్వీకరించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్ర‌తి ఏడాది భారత్‌, చైనా సహా ప‌లు దేశాల‌నుంచి నుంచి వేల మందిని అక్కడి టెక్కిలను అమెరికాలోని సంస్థలు నియమించుకుంటాయి.

క‌రోనా కారణంగా ఇమ్మిగ్రేషన్‌ సవాళ్లు ఎదురయ్యాయని... యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ తెలిపింది. అంతర్జాతీయ విమాన స‌ర్వీసులు రద్దవ్వడంతో హెచ్‌-1బి వీసాదారులు చాలామంది అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొంద‌రికి వీసా అనుమతులు ముగుస్తాయి. వీరి గడువు పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తామ‌ని వారి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది.

కోవిడ్ 19 కార‌ణంగా వీసా గ‌డువు ముగిసిన చాలా మంది అమెరికాలో ఉన్న‌ట్లు గుర్తించిమ‌ని తెలిపింది. 'ఈ సమస్యను పరిష్కరించేందుకు వనరులతోనే జాగ్రత్తగా పనిచేస్తాం. మహమ్మారి అమెరికన్ల ఉపాధి, విధానాలు, పరిగణనలోకి తీసుకుంటాం. అభ్యర్థులు దరఖాస్తులు చేస్తే వారు చట్టవిరుద్ధంగా ఉంటున్నట్టుగా భావించం. అన్ని స‌క్ర‌మంగా ఉంటే 240 రోజుల గడువు దానంతట అదే లభిస్తుంది. కరోనాతో ఇత‌ర‌త్రా కారణాలతో దరఖాస్తులు ఆలస్యమైతే కష్ట‌మ‌ని డీహెచ్‌ఎస్‌ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories