అమెరికా విమాన ప్రమాదం: ఏటీసీ సిబ్బంది పైలట్‌తో ఏం చెప్పారంటే?

America Airplane Accident Here is What ATC Said to Pilot
x

అమెరికా విమాన ప్రమాదం: ఏటీసీ సిబ్బంది పైలట్‌తో ఏం చెప్పారంటే?

Highlights

American Airlines Plane Crash: అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో విమానం, హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు.

American Airlines Plane Crash: అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో విమానం, హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. గల్లంతైనవారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించారు.

బుధవారం అమెరికాలోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం హెలికాప్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన 18 మంది మృతదేహలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గాలిలోనే బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను బుధవారం రాత్రి ఢీకొట్టింది. వెంటనే విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. కాన్సాస్‌లోని విషిటా నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానం ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు ఈ ప్రమాదానికి గురైంది. పోటోమాక్ నదిలో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంతో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్ట్ లో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు అంతరాయం ఏర్పడింది.

విమానం ల్యాండింగ్ కు ముందు ఏం జరిగింది?

ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కోసం పైలట్ రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు ట్రాఫిక్ కంట్రోలర్ ను సంప్రదించారు. ఈ ఎయిర్ పోర్టులోని 33 రన్ వే పై విమానాన్ని ల్యాండ్ చేయాలని ఏటీసీ నుంచి పైలట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రన్ వై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు సిద్దమయ్యారు.

విమానం ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. అదే సమయంలో విమానానికి ఎదురుగా బ్లాక్ హాక్ హెలికాప్టర్ వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏటీసీ సిబ్బంది హెలికాప్టర్ పైలట్ ను అలెర్ట్ చేశారు. మీకు ఎదురుగా విమానం కన్పిస్తోందా అని ప్రశ్నించారు. మరో మేసేజ్ వెళ్లింది.

అదే సమయంలో గాల్లోనే విమానం, హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానం వెంటనే ల్యాండ్ కావాలని పైలెట్ ఏటీసీ సిబ్బందిని కోరారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది.విమానం ల్యాండింగ్ కు ఏడు నిమిషాల ముందే ప్రమాదం జరిగింది. నిర్ణీత సమయం మేరకు బుధవారం రాత్రి 9 గంటలకు విమానం రీగన్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. కానీ, బుధవారం రాత్రి 9.53 గంటలకు విమానం పోటోమాక్ నదిలోపై కూలిపోయింది.

సహాయక చర్యలు

అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో 60 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. మరో వైపు సైనిక హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు.

పోటోమాక్ నదిలో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు

పోటోమాక్ నదిలో మైనస్ 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలుంటాయి. ఈ నదిలో విమానం, హెలికాప్టర్ కుప్పకూలాయి. విమానంలోని ప్రయాణీకులు, హెలికాప్టర్ లోని సిబ్బంది ఈ నదిలో పడిపోయారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలతో వీరికి శ్వాస తీసుకోవడంతో పాటు హైపర్ రీవెంటిలేషన్ వంటి పరిస్థితి తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఈ నీటిలో ఉంటే ప్రాణాపాయం తప్పదంటున్నారు. ఇంత తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఉన్న మనిషికి 15 నిమిషాల్లోనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories