Taiwan parliament: రణరంగంగా తైవాన్ పార్లమెంట్.. పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు


Taiwan parliament: రణరంగంగా తైవాన్ పార్లమెంట్.. పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు
Taiwan parliament: స్పీకర్ చుట్టూ చేరి గందరగోళం సృష్టించిన ఎంపీలు
Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. సభలో ఎంపీలు తన్నుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు వాదోపవాదాలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మధ్యాహ్నం తర్వాత కొంత మేర సద్దుమణిగినా తిరిగి మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే బిల్లులో కొన్ని సవరణలను చేర్చాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.ఈ విషయమై సభలో సభ్యులు పట్టుబట్టారు. ఈ డిమాండ్ తో ఎంపీలు స్పీకర్ చుట్టూ చేరి గందరగోళం సృష్టించారు. టేబుళ్లపైకి ఎక్కి నిరసనకు దిగారు. సహచర సభ్యులను బెంచీలపై నుంచి కిందకు తోశారు. ఒకానొక దశలో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.సభలో ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు.ఓ ఎంపీ ఫైళ్లు లాక్కొని పార్లమెంట్ నుంచి బయటకు పరుగులు తీశాడు. సభలో గందరగోళానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



