అఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం..

అఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం..
x
Airplane crash in Afghanistan
Highlights

అఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.

అఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘాంజీ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంతో ఎంత మంది మరణించారు అనే దానిపై స్పష్టత రాలేదు. 83 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం తాలిబాన్ల ఉండే ప్రావిన్స్ లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. సోమవారం 1:40 గంటల సమయంలో విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆఫ్గనిస్తాన్‌ లోని జాతీయ విమాన సంస్థ అరియానా ఎయిర్‌లైన్స్‌ ప్రమాద వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలు అన్ని బాగానే ఉన్నాయని వాటికి ఏ ప్రమాదం రాలేదని వెల్లడించింది. ఘాంజీ ప్రావిన్స్‌లో హిందూకుష్‌ పర్వతాల వద్ద మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. గతంలో 2005లో అదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. అనేక సార్లు సైనుకుల విమానలు కూలిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories