గాల్లో వేలాడిన విమానం.... లక్కీగా బయటపడ్డారు

గాల్లో వేలాడిన విమానం.... లక్కీగా బయటపడ్డారు
x
Highlights

గాల్లో ఎగిరిన విమానం కూలిపోతుందని కంగారు పడ్డారు. ప్రాణాలు పోతాయని ఆందోళనకు గురైయ్యారు. ఇంతలో వైర్లకు తగిలి విమానం కింద పడలేదు.

గాల్లో ఎగిరిన విమానం , కాసేపట్లో అనుకోని ప్రమాదం వచ్చింది, దీంతో కూలిపోతుందని కంగారు పడ్డారు. ప్రాణాలు పోతాయని ఆందోళనకు గురైయ్యారు. ఇంతలో వైర్లకు తగిలి విమానం కింద పడలేదు. దీంతో వారు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుంకుంది. విమానం అదుపుతప్పి గాల్లో ఎగురుతూ వైర్లకు తగిలి తలకిందులైది. దాన్ని కిందపడకుండా వైర్లకు అడ్డుకున్నాయి. అయితే అందులో ఉన్న పైలట్ తో సహా మరో ప్రయాణికుడు ప్రాణాలతో దక్కించుకున్నారు. ఈ ప్రమాదాన్ని తెలుసుకొన్న CNSAS రెస్క్యూ టీమ్ వారిని కాపాడారు. దీంతో ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం కేబుళ్లకు చిక్కుకున్న విమానాన్ని నెమ్మదిగా కిందికి దించారు. విమానం వైర్లలో చిక్కుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని CNSAS అధికార ప్రతినిధి వాల్టర్ మిలన్ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో పైలట్, ప్రయాణికుడు ఎగురుతుండగా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. కాగా.. విమానం అదుపుతప్పి కూలిపోయే సమయంలో స్కీ లిఫ్ట్ కేబుళ్లు దానిని అడ్డుకున్నాయి. దీంతో విమానం వైర్లకు తగిలి తలకిందులుగా పడింది. మొత్తం 20 మంది రెస్య్క్యూ సిబ్బంది ఈ పరేషన్ లో పాల్గొన్నారు. దాదాపు గంటకుపైగా శ్రమించి వారిని ఫైలట్, ప్రయాణికుడిని కాపాడారు.


Show Full Article
Print Article
Next Story
More Stories