Talibans: తమ డబ్బులు తమకు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవు

Afghanistan Taliban Warning to America
x

అగ్రరాజ్యం అమెరికాకు తాలిబన్ల వార్నింగ్ (ఫైల్ ఇమేజ్) 

Highlights

Talibans: అగ్రరాజ్యం అమెరికాకు ఆఫ్ఘన్ తాలిబన్లు హెచ్చరికలు వార్నింగ్

Talibans: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న నేపధ్యంలో తాలిబన్లు మరోసారి అగ్రరాజ్యంపై వార్నింగ్ కామెంట్స్ చేశారు. తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోవడంతో ఆప్ఘనిస్థాన్‌లో ఆహార సమస్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ వింటర్ సీజన్‌లో ఆహార సమస్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, సహా పలు దేశాలకు తాలిబన్లు హెచ్చరికలు చేశారు.

తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయాలని అగ్రరాజ్యం అమెరికాకు తాలిబన్లు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలసలు పెరుగుతాయని ఆ వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తమ సెంట్రల్ నిధులను, ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం ఆశ్చర్యకరంగా ఉందని తాలిబన్ నేతలు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దోహా ఒప్పందానికి విరుద్ధంగా అమెరికా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories