Top
logo

Afganistan Car Bomb Blast: ఆఫ్గనిస్తాన్ లో కార్ బాంబు పేలుడు.. 5 మంది మృతి..

Afganistan Car Bomb Blast: ఆఫ్గనిస్తాన్ లో కార్ బాంబు పేలుడు.. 5 మంది మృతి..
X
Highlights

Afganistan Car Bomb Blast: ఆఫ్గనిస్తాన్ లోని బాల్ఖ్ ప్రత్యేక దళాల శిబిరం వెలుపల మంగళవారం ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఐదుగురు మరణించారు.

Afganistan Car Bomb Blast: ఆఫ్గనిస్తాన్ లోని బాల్ఖ్ ప్రత్యేక దళాల శిబిరం వెలుపల మంగళవారం ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఐదుగురు మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ సంఘటన బాల్ఖ్ జిల్లాలో జరిగింది, బాధితులను అంబులెన్సులు, ఆర్మీ వాహనాల సహాయం ద్వారా సైనిక, అలగే పౌర ఆసుపత్రులకు తరలించినట్లు ఈ ఆర్మీ అధికారి షాహీన్ ప్రతినిధి హనీఫ్ రెజాయ్ జిన్హువా తెలిపారు.

ఈ ఘటనలో బాధితుల్లో ఇద్దరు సైనికులు, ముగ్గురు పౌరులు, గాయపడిన వారిలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారని.. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని రెజాయ్ తెలిపారు. దాడికి ఇప్పటివరకు ఏ సమూహమూ బాధ్యత వహించలేదు అని తెలిపారు.

Web TitleAfganistan Car Bomb Blast 5 dead and 32 injured in blast incident
Next Story