నా పేరు పెప్పర్ నేను నిశ్చితార్ధం ఉంగరం మింగాను'

నా పేరు పెప్పర్ నేను నిశ్చితార్ధం ఉంగరం మింగాను
x
Highlights

తినడానికి ఉద్దేశించినది కానప్పటికీ, ఖరీదైన వంటకాలకు అలవాటుపడినట్టుంది ఆ కుక్క. దక్షిణాఫ్రికాకు చెందిన పెప్పర్ అనే కుక్క అనుకోకుండా తన యజమాని నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది.

తినడానికి ఉద్దేశించినది కానప్పటికీ, ఖరీదైన వంటకాలకు అలవాటుపడినట్టుంది ఆ కుక్క. దక్షిణాఫ్రికాకు చెందిన పెప్పర్ అనే కుక్క అనుకోకుండా తన యజమాని నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది. దాంతో ఆసుపత్రి పాలైంది. పెప్పర్‌ వ్యాలీ ఫార్మ్ యానిమల్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఈ విషయాన్నీ హాస్పిటల్ యాజమాన్యం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా పెప్పర్‌ ఎక్స్-రే ఫోటోలను పేజీలో పంచుకుంది.

అందులో 'నా పేరు పెప్పర్. నేను కొంచెం వికారంగా కనిపిస్తున్నానా? ఎందుకంటే వెట్(వెటర్నరీ డాక్టర్) ఇప్పుడే ఏదో ఇచ్చింది నేను వాంతి చేసుకోవడానికి.. నేను మా యజమాని నిశ్చితార్థపు ఉంగరాన్ని తిన్నాను కాబట్టి!' అందుకే నేను ఇలా ఉన్నాను.. అడగవద్దు! ఆ సమయంలో ఇది మంచి ఆలోచన అనిపించింది !!' అని పేర్కొన్నారు. ఏమైనప్పటికి ఆ కుక్క చేసిన పనికి చివరకు ఉంగరం కొత్తగా మెరుస్తూ దాని కడుపులోనుంచి బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ ఫేసుబుక్ లో వైరల్ గా మారింది. ఏకంగా 4 వేల షేర్లు వచ్చాయి. అంతేకాదు 3 వేల కంటే ఎక్కువ కామెంట్లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు కుక్క బాగానే ఉండటంతో సంతోషించారు, మరికొందరు తమ సొంత పెంపుడు జంతువులతో అనుభవించిన ఇలాంటి సందర్భాలను పంచుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories