ఇరవై ఏళ్ల క్రితం మాయమైన చారిత్రాత్మక ఉంగరం దొరికింది

ఇరవై  ఏళ్ల క్రితం మాయమైన చారిత్రాత్మక ఉంగరం దొరికింది
x
Highlights

పోగొట్టుకున్న వస్తువులు కానీ లేదా ఎవరైనా దొంగిలించిన వస్తువులు కానీ దొరకడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ 20ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన ఒక...

పోగొట్టుకున్న వస్తువులు కానీ లేదా ఎవరైనా దొంగిలించిన వస్తువులు కానీ దొరకడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ 20ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన ఒక ప్రఖ్యాతి గాంచిన ఉంగరం ఇటీవల దొరికింది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. 'ఇండియానా జోన్స్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ వరల్డ్‌'గా పేరొందిన డచ్‌ ఆర్ట్‌ డిటెక్టివ్‌ ఆర్థర్‌ బ్రాండ్‌ ఈ మిస్టరీని కనిపెట్టాడు. 1876లో ఆస్కార్‌వైల్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఈ ఉంగరాన్ని అతని స్నేహితునికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సేకరించిన ఎన్నో విలువైన వస్తువుల్లో ఈ ఉంగరం కూడా ఒకటి.

2002లో వర్సిటీలో పనిచేసిన మాజీ చప్రాసిగా పనిచేస్తున్న ఒకరు ఆ ఉంగరాన్ని దొంగిలించి స్క్రాప్‌ డీలర్‌కు అమ్మేశాడు. అప్పటి నుంచి ఆ ఉంగరం ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని ఎలాగయినా కనిపెట్టాలనుకున్నాడు ఆర్థర్‌ బ్రాండ్‌. తనకు ఉన్న అండర్‌వరల్డ్‌ సంబంధాలను అన్నింటిని ఉపయోగించి చివరికి ప్రముఖ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌కు చెందిన ఉంగరాన్ని కనిపెట్టారు. రింగ్ కు గ్రీకు భాషలో "ప్రేమ బహుమతి, ప్రేమను కోరుకునేవారికి" అని చెప్పి రాసిఉంది. దీనికి లోపలి భాగంలో "OF OF WW + RRH to WWW" అనే అక్షరాలు కూడా ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories