United States: పాముల కోసం పొగ పెడితే.. 13 కోట్ల ఇల్లు కాలిపోయింది

Sandeep Reddy
Published on: 7 Dec 2021 12:49 PM IST
A Man Loss his Own House With Fire Accident by Small Mistake in United States
X

United States: పాముల కోసం పొగ పెడితే.. 13 కోట్ల ఇల్లు కాలిపోయింది

United States: కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందని అన్నట్లుగా తన ఇంటికి పట్టిన పాముల పీడను వదిలించుకుందామని అమెరికాలో మేరీలాండ్ కి చెందిన ఒక వ్యక్తి చేసిన ప్రయత్నంతో కోట్ల విలువైన ఇల్లు కాస్త కాలి బూడిద అయింది. తన ఇంట్లో పాములతో ఇబ్బంది ఎక్కువగా ఉందని బొగ్గును ఉపయోగించి పొగపెట్టాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులకు బొగ్గును దగ్గరగా ఉంచడంతో అవి కాస్త అంటుకొని ఇంటి మొత్తానికి నిప్పు అంటుకుంది.

ఎలాంటి ప్రాణహాని జరగకపోయిన దాదాపుగా పదివేల చదరపు అడుగుల్లో 1.8 మిలియన్ డాలర్ల(13 కోట్ల) విలువైన ఇల్లు ఇలా మంటల్లో కాలిపోవడంతో ఆ ఇంటి యజమాని కన్నీరుమున్నీరై విలపించాడు. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను అక్కడి ఫైర్ స్టేషన్ అధికారులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక పోస్ట్ పై నెటిజన్లు మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్న ఇలా ఇల్లును మాత్రం కాల్చుకునే ప్రయత్నం మాత్రం చేయమని చెబుతున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story