హత విధీ..దుప్పిని వేటాడబోయాడు..ఆ దుప్పి చేతిలోనే చచ్చాడు!

హత విధీ..దుప్పిని వేటాడబోయాడు..ఆ దుప్పి చేతిలోనే చచ్చాడు!
x
Highlights

ఖర్మ కాలిపోవడం అంటే ఇదే! తాను వేటాడదామనుకున్న జంతువు చేతిలో తానే చచ్చిపోవడం.

మనకి వేటగాడు.. జంతువుల కథలు చిన్న పిల్లలకు తెగ చెబుతుంటారు. వేటగాడి కన్ను గప్పి పారిపోయిన జంతువుల కథలు చాలా వింటుంటాము. సరిగ్గా ఇదీ అలాంటిదే. కొందరికి వేట అంటే సరదా.. ఇంకొందరికి పిచ్చి కూడానూ. కానీ, వేట కోసం అరణ్యానికి వెళితే ఎన్నో సమస్యలు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగొచ్చు. సాధారణంగా అడవి లో వేటగాళ్ళు పెద్ద జంతువు చేతిలో.. లేదా పాము కాట్లతో.. ఇంకా కాదంటే ఏమరపాటుతో లోయల్లాంటి ప్రాంతాల్లో పడిపోయి ప్రాణాలను కోల్పోతారు. కానీ, అమెరికాలోని ఓ వేటగాడు తాను వేటాడిన దుప్పి చేతిలోనే మరణించాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును ఇది నిజం. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అమెరికాలో అలేగ్జాండర్ అనే వ్యక్తీ ఓజార్క్ పర్వత ప్రాంతాల్లో యెల్విల్లే సమీపంలో వేటకు వెళ్ళాడు. చాలా సేపు వేట కోసం తిరిగాడు. ఈ క్రమంలో అతనికి ఒక దుప్పి కనిపించింది. అబ్బ ఇంకేముంది అనుకున్నాడు. దాని వెంట పడ్డాడు. సరిగ్గా గురి చూసాడు. గన్ తో కాల్చాడు. అంతే, పాపం ఆ దుప్పి కిందపడి గిలగిలా కొట్టుకుంది. కొంత సేపటికి కదలిక ఆగిపోయింది. ఆ దుప్పి చచ్చిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి మెల్లగా దాని దగ్గరకు చేరుకున్నాడు. దానిని తట్టి పరిశీలించాడు.

ఇంతలో అకస్మాత్తుగా ఓ సంఘటన జరిగింది. పడి ఉన్న ఆ దుప్పి ఒక్కసారిగా పైకి ఎగిరింది. ఈ అదటుకు అలెగ్జాండర్ తుళ్ళి పడి కింద పడ్డాడు. అంతే, ఆ దుప్పి ఒక్కసారిగా అతని పై దాడి చేసింది. షాక్ నుంచి తేరుకునే లోపు ఎడా పెడా కుమ్మేసింది. దాంతో అలెగ్జాండర్ తీవరంగా గాయపడ్డాడు. మంగళవారం ఈ సంఘటన జరిగింది. తరువాత ఆ వేటగాడు చచ్చీ చెడీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలెగ్జాండర్ శుక్రవారం మరణించాడు.

ఈ వార్త అక్కడి టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. దాంతో ఈ వార్తా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. సంచలనంగా మారింది. ఆ దుప్పి తెలివితేటల్ని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అలెగ్జాండర్ దుప్పులను వేటాడటం తప్పని వారంటున్నారు. దుప్పి భలే పని చేసింది. చచ్చినట్టు నటించి తనను చంపడానికి ప్రయత్నించిన వాడినే చంపేసింది అని అందరూ అనుకుంటున్నారు. వేట పిచ్చిపని అని ఆ పనికి తగిన శాస్తి జరిగింది అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories