Omicron Cases: ప్రపంచవ్యాప్తంగా 81వేలు దాటిన ఒమిక్రాన్‌ కేసులు

81 Thousand Omicron Cases Reported in Worldwide
x

ప్రపంచవ్యాప్తంగా 81వేలు దాటిన ఒమిక్రాన్‌ కేసులు

Highlights

*డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తోందన్న WHO *ఇండియాలో 169కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

Omicron Cases: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెకండ్‌వేవ్‌ నుంచి కోలుకుంటున్నామనుకునేలోపే.. విరుచుకుపడుతోంది. అతి తక్కువ సమయంలోనే చాలా దేశాలకు వ్యాపించింది. ఈ కొత్త రకం వైరస్‌ను ఆందోళనకర వైరస్‌గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో.. డెల్టా కంటే ఒమిక్రాన్‌ ఆరురెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తోందని హెచ్చరించింది.

ఒమిక్రాన్‌ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ 30 రకాలకు పైగా ఉత్పరివర్తనాలు చెందుతుండటంతో.. అన్ని రకాల రోగనిరోధక శక్తులను అధిగమించి వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌతాఫ్రికాలో ఈ వైరస్‌ బారిన పడిన వారిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నవారూ ఉన్నారు. ఇతర దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. టీకాలు రెండు డోసులూ వేయించుకున్న వారికీ ఒమిక్రాన్‌ సోకుతోందంటే.. వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని వెతికి పట్టుకుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

యూకేలో రోజుకు దాదాపు లక్ష ఒమిక్రాన్‌ కేసులు బయట పడుతుండటంతో రెండు వారాలు లాక్‌డౌన్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం యోచిస్తోంది. భారీ సంఖ్యలో వస్తున్న కేసుల నియంత్రణకు.. 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాల బూస్టర్‌ డోసులు అందించాలని యూకే నిర్ణయించింది. మరోవైపు.. దేశ ప్రజలంతా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. భారత్‌లో మాత్రం ఇప్పట్లో బూస్టర్‌ డోసులు ఇచ్చే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని సౌతాఫ్రికా సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. అన్ని దేశాల్లో కేసులు రెట్టింపు అయ్యేందుకు తక్కువ సమయమే పడుతోందని వారు సూచించారు. ప్రస్తుతం యువతకే పరిమితమైనా, పెద్దవయసు వారికీ సోకడం మొదలైతే.. అన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలన్నింటినీ పూర్తిస్థాయిలో పాటించకపోతే ముప్పు తప్పదని వారిస్తున్నారు. తగిన స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటేనే ఒమిక్రాన్‌ విజృంభణను కట్టడి చేయగలమని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories