Honduras: హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

41 Women Killed In Riot At Womens Prison
x

Honduras: హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

Highlights

Honduras: మరాస్ వీధి ముఠాల పనేనన్న అధ్యక్షుడు

Honduras: హోండురస్ మహిళా జైలులో మారణ హోమం జరిగింది. జైలులో చెలరేగిన అల్లర్ల కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలోని టమారా జైలులో ఈ దారుణం చోటుచేసుకుంది. బారియో తెగకు చెందిన 18 మందితో కూడిన ముఠా ఖైదీల సెల్ లోకి చొరబడి కొందరిని కాల్చి చంపగా మరికొందరిని తగలబెట్టింది.

ఈ ఘటనలో 26 మంది మహిళలు అగ్నికి ఆహుతయ్యారు. దుండగులు అందులో కొందరిని కాల్చి, మరికొందరిని కత్తితో పొడిచి చంపేసారు. ఇప్పటి వరకు 41 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. ఘటనా స్థలం నుంచి తుపాకులు, పెద్దపెద్ద కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు ఖైదీలకు టెగుసిగల్పలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ హింసాకాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో విచారం వ్యక్తం చేశారు. ఇది జైలులో ఆధిపత్యం ఉన్న మరాస్ వీధి ముఠాల పనేనని అన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories