Shopping Mall: షాపింగ్‌మాల్‌లో పేలిన వేడినీటి పైప్‌లైన్‌.. నలుగురు మృతి

4 Killed after Hot Water Pipe Bursts in Moscow Mall
x

Shopping Mall: షాపింగ్‌మాల్‌లో పేలిన వేడినీటి పైప్‌లైన్‌.. నలుగురు మృతి

Highlights

Shopping Mall: రష్యా రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ప్రమాదం

Shopping Mall: రష్యా రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్‌ మాల్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. మాస్కోలోని ద సీజన్స్‌ అనే షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా వేడి నీటి పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో నలుగురు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్‌ సెర్జీ సోబ్యానిన్‌ తెలిపారు.

చాలామంది కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించామన్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. అయితే పైపు పేలిన తర్వాత అమ్మోనియా లీక్‌ కాలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ షాపింగ్‌ మాల్‌ను 2007లో ఓపెన్‌ చేశారు. అందులో 150 స్టోర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories