Moscow: మాస్కో ఉగ్రదాడి ముష్కరుల నేరాంగీకారం

3 suspects in Moscow concert hall attack plead guilty in court
x

Moscow: మాస్కో ఉగ్రదాడి ముష్కరుల నేరాంగీకారం

Highlights

Moscow: ఓ సంగీత కచేరీపై విరుచుకుపడిన ఉగ్రవాదులు

Moscow: ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్న ముష్కరులు... రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు. కాల్పులు, బాంబు పేలుళ్ల తర్వాత పరారయ్యే ప్రయత్నంలో పట్టుబడిన నలుగురిని మాస్కోలోని బాస్మనీ జిల్లా న్యాయస్థానంలో హాజరు పరిచారు. వీరందరినీ అద్దాల గదిలో ఉంచి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వారిలో ఒకరి చెవి పూర్తిగా కోసేసి ఉంది. మే 22 వరకు నలుగురినీ కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.

పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిలోనే ఈ నలుగురు దలెర్ద్‌ జొన్‌ మిర్జొయెవ్‌, సైదక్రామి రచబలి జొద, షంసిదున్‌ ఫరీదుని, ముఖమ్మద్‌ సొబిర్‌ ఫైజొవ్‌ ఉన్నారు. వీరు అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ - ఖొరాసాన్‌ ఉగ్ర ముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో కనిపించిన ముగ్గురూ నేరాన్ని అంగీకరించగా.. నాలుగో వ్యక్తి అసలు మాట్లాడలేని స్థితిలో.. విచారణ జరుగుతున్నంతసేపూ చక్రాల కుర్చీలో కళ్లు మూసుకొని ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories