
Sudan: సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య పోరు.. 200 మంది మృతి
Sudan: సూడాన్‌లో 24గంటల కాల్పులు విరమణ
Sudan: సూడాన్‌లో 24గంటల కాల్పుల విరమణకు ఇరువర్గాలు అంగీకరించాయి. సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య నాలుగు రోజులుగా పోరు కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ పోరు హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 200 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మంది గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు. సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పలు ప్రాంతాలు కాల్పులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఆహారం, వైద్యం అందక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొద్ది రోజుల క్రితం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సైన్యాధిపతి, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొద్ది వారాలుగా నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. మరోవైపు, పౌరుల సురక్షిత తరలింపు కోసం ప్రస్తుతం ఇరువర్గాలు 24 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




