న్యూయార్క్‌లో వారికోసం రూ. 200 కోట్ల నిధుల ప్రకటన

న్యూయార్క్‌లో వారికోసం రూ. 200 కోట్ల నిధుల ప్రకటన
x
Highlights

న్యూయార్క్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షల 26 వేల 198 కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 16 వేల 106 మంది మరణించారు.

న్యూయార్క్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షల 26 వేల 198 కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 16 వేల 106 మంది మరణించారు. రాష్ట్రం ఆర్ధికంగా కుప్పకూలింది. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో వలస కూలీలు మరియు వారి కుటుంబాల కోసం 20 మిలియన్ (సుమారు రూ .200 కోట్లు) నిధిని ప్రకటించారు. దీనివల్ల 20 వేలకు పైగా కూలీలకు ప్రయోజనం కలుగుతుంది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సహకారంతో ఈ నిధిని ప్రకటించారు. అంతేకాదు వ్యాధి మరింత తీవ్రతరం అవుతుండడంతో న్యూయార్క్ లో లాక్డౌన్ ను మే 15 వరకూ పొడిగించారు.

ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా క్యూమో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ ను అధిగమించామని చెప్పారు. క్రమంగా సంక్రమణ రేటు తగ్గుతోందని.. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు కఠినమైన సామాజిక దూరం అనుసరించబడుతుందని. కాలిఫోర్నియా, ఫ్లోరిడా మరియు మిచిగాన్ కంటే న్యూయార్క్‌లో మాత్రమే ఎక్కువ కరోనా పరీక్ష కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ సామర్ధ్యంతోనే గత ఒక నెలలో సుమారు 5 లక్షల మందికి పరీక్షలు చేసినట్టు వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories