బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి

బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
x
Highlights

థాయిలాండ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బౌద్ధ దేవాలయానికి వెళుతున్న బస్సు ఆదివారం సెంట్రల్ థాయ్‌లాండ్‌లో రైలు ఢీకొనడంతో

థాయిలాండ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బౌద్ధ దేవాలయానికి వెళుతున్న బస్సు ఆదివారం సెంట్రల్ థాయ్‌లాండ్‌లో రైలు ఢీకొనడంతో 20 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. బ్యాంకాక్‌కు తూర్పున 63 కిలోమీటర్ల (40 మైళ్ళు) ఖ్లాంగ్ క్వాంగ్ క్లాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8:05 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చాచోఎంగ్సావో ప్రావిన్స్ గవర్నర్ మైత్రీ త్రిటిలానన్ తెలిపారు. ఆలయంలో బౌద్ధ వేడుకకు 60 మంది ఫ్యాక్టరీ కార్మికులతో వెళుతున్న టూర్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా దేశానికి తూర్పు నుండి రాజధానికి వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది.. దాంతో బస్సు పల్టీలు కొట్టింది.. అంతేకాకుండా పైభాగం విరగడంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది.

శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్పాట్ లో 18 మంది మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ముప్పైమంది గాయపడ్డారు. మరో పది మంది మాత్రం బస్సులో.. చివర కూర్చోవడంతో వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కాగా థాయ్‌లాండ్ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే గుర్తించిన సంగతి తెలిసిందే. సంవత్సరాల తరబడి భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ పెద్దగా మార్పు లేదు.. రోజూ ఏదో ఒక మూలాన పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories