సైబీరియాలో బయట పడ్డ ఆ కుక్కపిల్ల మృతదేహానికి 18 వందల ఏళ్లు!

సైబీరియాలో బయట పడ్డ ఆ కుక్కపిల్ల మృతదేహానికి 18 వందల ఏళ్లు!
x
Highlights

ఏదైనా ప్రాణి చనిపోతే.. ఆ విగత శరీరం కొన్ని నెలలు చెక్కు చెదరకుండా వుండొచ్చు.. కానీ..వందల సంవత్సరాలు ఒక జీవి శరీరం చెక్కు చెదరకుండా వుంటే..అది...

ఏదైనా ప్రాణి చనిపోతే.. ఆ విగత శరీరం కొన్ని నెలలు చెక్కు చెదరకుండా వుండొచ్చు.. కానీ..వందల సంవత్సరాలు ఒక జీవి శరీరం చెక్కు చెదరకుండా వుంటే..అది విచిత్రమైన విషయమే. సరిగ్గా ఆ విచిత్రం ఇటీవల వెలుగు చూసింది. ఆ విశేషాలు మీకోసం..

సైబీరియాలో 1800 సంవత్సరాల క్రితం చనిపోయినట్టుగా భావిస్తున్న ఒక కుక్క పిల్ల మృతదేహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ కుక్కపిల్ల చనిపోయినప్పుడు రెండు నెలల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కుక్క పిల్ల ఏ విధంగా చనిపోయిందో దానికి సంబంధించిన కారణాలు ఇంకా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఈ కుక్క పిల్ల శరీరం పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నందువల్ల దాని మూతి, మీసాలు, వెంట్రుకలు అన్నీ సజీవంగా ఉన్నప్పటి లాగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ జీవి రూపు రేఖల పట్ల పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అది కుక్క లేదా తోడేలా అన్న విషయాన్ని ఖచ్చితంగా కనిపెట్టలేకపోయారు. ఇది తోడేలు పిల్ల లేదా కుక్క అని నిర్ధారించడానికి దీనికి సంబంధించిన నమూనాలను స్వీడిష్ సెంటర్ ఫర్ పాలియోజెనెటిక్స్ (సిపిజి) కు పంపారు. స్వీడన్ శాస్త్రవేత్తలు తెలిపిన నివేదిక ప్రకారం ఈ జంతువుకు 18,000 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు ధృవీకరించారు, అయితే, "ఇప్పటివరకు, మేము దాని జన్యువును 2X కవరేజీకి పంపించాము కాని అది తోడేలా లేదా కుక్క అన్న విషయాన్ని ఇంకా మేము కనిపెట్టలేదని వారు తెలిపారు. ప్రస్తుతం ఆ జీవిని కుక్కగానే పరిగణలోకి తీసకున్నారు. దానికి డోగోర్ అని పేరు కూడా పెట్టారు.

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories