ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ.. 24గంటల్లో 16 లక్షల కేసులు.. 7 వేల మరణాలు

16 Lakhs Corona Cases Recorded World Wide Today 31 12 2021 and 7000 Deaths Recorded | Corona Live Updates
x

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ.. 24గంటల్లో 16 లక్షల కేసులు.. 7 వేల మరణాలు

Highlights

Corona Live Updates: *అమెరికాలో కొత్తగా 4.65 లక్షల పాజిటివ్‌లు *ఫ్రాన్స్‌లో మళ్లీ 2లక్షలపైనే కేసులు నమోదు

Corona Live Updates: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ డెల్టా వేరియంట్‌కు.. ఒమిక్రాన్‌ తోడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 16.04 లక్షల మంది వైరస్‌ బారినపడగ.. 7వేల 317 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారంతో పోలిస్తే.. కేసులు 4 లక్షలు, మరణాలు 800 వరకు పెరిగాయి. అమెరికాలో కొత్తగా 4.65 లక్షల పాజిటివ్‌లు రికార్డయ్యాయి. మరణాలు 17వందల 77 గా నమోదయ్యాయి.

ఫ్రాన్స్‌లో సైతం కొవిడ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. అక్కడ కేసులు 2 లక్షలకు తగ్గడం లేదు. తాజాగా 2.08 లక్షల పాజిటివ్‌లు నమోదుకాగా 184 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో బుధవారం కంటే బాధితులు మరో వెయ్యి పెరిగారు. అమెరికా తర్వాత రష్యాలో 932, పోలండ్‌‌లో 794 మంది మృతి చెందారు. పోలాండ్‌లో కేసులు 15 వేల మధ్యనే ఉంటున్నా.. మరణాలు భారీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ ఉధృతితో యూకే అతలాకుతలం అవుతోంది.

ఇదివరకు ఎన్నడూ లేనంతగా కొత్తగా 1.83 లక్షల పాజిటివ్‌లు నమోదయ్యాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ఆస్పత్రుల్లో రోగులకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి చేశాయి. ఫ్రాన్స్‌లో 12 ఏళ్లు పైబడిన వారు, పర్యాటకులు ఇవాళ్టి నుంచి బహిరంగ స్థలాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది.

దీన్ని ఉల్లంఘించినవారికి 135 యూరోల జరిమానా విధిస్తారు. చైనాలో సుదీర్ఘ లాక్‌డౌన్‌లో ఉన్న షియాన్‌ నగరంలోని కోటీ 30 లక్షల జనాభాకు రోజూ ఇంటివద్దకే నిత్యావసరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. మెక్సికో ప్రజలకు మూడు డోసుల క్యూబా వ్యాక్సిన్‌ వేయడానికి ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది. కెనడాలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలను కఠినతరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories