Philippines Typhoon Rai: ఫిలిప్పీన్స్‌ను కకావికలం చేసిన సూపర్ టైఫూన్ 'రాయ్'

112 Reported Dead in Philippines Typhoon Rai
x

ఫిలిప్పీన్స్‌ను కకావికలం చేసిన సూపర్ టైఫూన్ 'రాయ్'

Highlights

*112కు చేరిన తుఫాన్ మృతుల సంఖ్య *కూలిన ఇళ్లు, భవనాలు.. నిలిచిన విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ

Philippines Typhoon Rai: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్‌ను ఛిన్నాభిన్నం చేసింది. రాయ్ తుఫాన్ ధాటికి 112 మంది మరణించారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 8 లక్షల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రాయ్ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. బీచ్ ల వద్ద ఉండే రిసార్టులు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి.

విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు పైకప్పుల్లేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ దాటి వెళ్లిపోవడంతో దేశంలో సహాయచర్యలు ముమ్మరం చేశారు. కాగా రాయ్ ఇప్పటికీ టైఫూన్ స్థాయిలోనే కొనసాగుతోంది. ఇది వియత్నాం తీరాన్ని తాకుతూ ఉత్తర దిశగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories