టేపును ధరించి రన్నింగ్‌.. 3 స్వర్ణాలు సాధించిన చిన్నారి

టేపును ధరించి రన్నింగ్‌.. 3 స్వర్ణాలు సాధించిన చిన్నారి
x
రియా బుల్లోస్
Highlights

కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి చాలా మందిని విజయం వైపు నడిపిస్తుంది. విజయం సాధించడానికి కావలసింది ఆస్తి అంతస్తులు కాదు పట్టుదల.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి చాలా మందిని విజయం వైపు నడిపిస్తుంది. విజయం సాధించడానికి కావలసింది ఆస్తి అంతస్తులు కాదు పట్టుదల. పేదరికం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ పట్టుదల ఉన్నవారిని ఎవరిని అపజయం పాలు కానివ్వదు. అలాంటి పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించ వచ్చు. ప్రపంచ స్థాయిలోనే విజయ కేతనం ఎగరేయవచ్చు. అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకోవచ్చు. అదే కోణంలో ఓ చిన్నారి తన పేదరికాన్ని కూడా లెక్కచేయకుండా ఏకంగా మూడు స్వర్ణ పథకాలను గెలుచుంది.

కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేని స్థితిలో కాళ్లకు టేపులు చుట్టుకుని పరుగులు తీసింది. అందరి కన్నావేగంగా పరుగులు తీసి విజయాన్ని సాధించింది. ఈ చిన్నారికి సంబంధించిన పూర్తి వివాల్లోకెళితే ఫిలిప్పీన్స్‌లోని బలాసన్‌కు చెందిన 11 ఏళ్ల చిన్నారి రియా బుల్లోస్. ఈ అమ్మాయి ఇటీవల ఇంటర్ స్కూల్ రన్నింగ్ పోటీల్లో పాల్గొని ఉత్సాహాన్ని కనబరిచింది. పోటీల్లో పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉన్న ఆమె పాదాలు చూస్తే కనీసం ధరించడానికి షూ కూడా లేవు.

అదే సమయంలో తనకు వచ్చిన ఒక మంచి ఐడియాను ప్రయోగించింది. పుస్తకాలను అతికించే టేపును తన రెండు పాదాలకు చుట్టుకుంది. అంతే కాదు దాని మీద బ్రాండెడ్ సంస్థ 'NIKE' లోగో, పేరును కూడా రాసుకుంది. ఆ టేపునే షూగా భావించి ఆ చిన్నారి ఆగకుండా పురుగులు తీసింది. 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పోటీలను విజయవంతంగా పూర్తి చేసింది. అందరికంటే అత్యంత ప్రతిభనుకనబరిచి మూడు పోటీల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతే కాదు మూడు స్వర్ణ పతకాలను సాధించి తన కోచ్ కు, తల్లిదండ్రులకు మంచి పేరును సాధించి పెట్టింది.

ఈ చిన్నారి కాళ్లకు టేపు చుట్టుకుని పరుగులు తీస్తున్న ఫోటోలు నెటిజన్ల ఫోన్ లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిన్నారి పట్టుదలకు ఎంతో మంది లైక్ లు కొడుతున్నారు. దాంతో పాటు ఆమె ఆర్థిక స్థోమతను తెలుసుకుని ఆమెకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బాస్కెట్ బాల్ స్టోర్ 'టైటాన్ 22' సీఈవో జెఫ్ కరియసో ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో ఆయన బుల్లోస్‌తో మాట్లాడారు. ఆయన సాయంతో ఆమె SM సిటీ ఇలోయిలోని స్టోరులో తనకు అవసరమైన స్పోర్ట్స్ షూలు, సాక్స్, స్పోర్ట్స్ బ్యాగ్ అందుకుంది. ఏదైతే నేం మొత్తానికి సోషల్ మీడియాతో ఆమెకు మేలు జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories