మరో 'వుహాన్' గా మారిన బ్రెజిల్‌ మనాస్ నగరం

మరో వుహాన్ గా మారిన బ్రెజిల్‌ మనాస్ నగరం
x
Highlights

బ్రెజిల్ లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇక్కడ 52,995 వేల మందికి ఈ వైరస్ సోకింది.

బ్రెజిల్ లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇక్కడ 52,995 వేల మందికి ఈ వైరస్ సోకింది.. 3300 మందికి పైగా మరణించారు. అయితే బ్రెజిల్‌లోని మనాస్ నగరం ప్రస్తుతం మరో 'వుహాన్' ను తలపిస్తోంది. 2.4 మిలియన్లు జనాభా కలిగిన మనస్ లో వేలాదిమంది మహమ్మారి భారిన పడ్డారు. నిన్నమొన్నటివరకు ఇక్కడ ప్రతిరోజూ 20 నుండి 30 కరోనా సోకినవారు చనిపోతున్నారు, కానీ ఇప్పుడు ఈ సంఖ్య 100 కి చేరుకుంది.

మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం లేనందున పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. మృతదేహాలను ఖననం చేయడానికి ఎవరూ రావడం లేదు. దాంతో స్థానిక పరిపాలనా సిబ్బందే మృతదేహాలను ఖననం చేస్తోంది. ఇందుకోసం కార్మికులు రాకపోవడంతో జెసిబి ద్వారా గుంతలు తవ్వి మృతదేహాలను అందులో పూడ్చి వేస్తున్నారు. వైరస్ భారిన పడి చనిపోయిన వారిని నేరుగా ఆసుపత్రి నుండి స్మశానవాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

మృతదేహాలను స్మశాన వాటికకు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. స్మశానవాటికలో కొద్దిమంది మాత్రమే సిబ్బంది ఉన్నారు దాంతో వేగంగా వస్తున్న మృతదేహాలను దహనం చెయ్యడానికి ఆలస్యం అవుతోంది. అంతేకాదు వందలాది మృతదేహాలు వస్తుండటంతో స్థలం లేక ఒకే గుంతలో సామూహికంగా బాక్షులలో పెట్టి పూడుస్తున్నారు. ఇక్కడ మరో దారుణమైన పరిస్థితి ఏమిటంటే చనిపోయిన వారి కుటుంబసభ్యుల్ని కనీసం స్మశానానికి కూడా అనుమతించడం లేదు. దాంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. కాగా కరోనావైరస్ కు కేంద్రంగా ఉన్న వుహాన్ లో ఇలాగే మృతదేహాలను ఖననం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories