Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మంది సజీవదహనం

100 Killed, Over 150 Injured In Fire During Wedding In Iraq
x

Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మంది సజీవదహనం

Highlights

Iraq: బాగ్దాద్‌లోని పెళ్లి వేడుక హాల్‌లో చెలరేగిన మంటలు

Iraq: ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇరాక్‌లోని అల్-హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100 మంది సజీవ దహనమయ్యారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వివాహ వేడుక జరుగుతున్న పెద్ద ఈవెంట్ హాల్‌లో మంటలు చెలరేగడానికి ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories