Sweden: స్వీడన్‌లోని పాఠశాలలో కాల్పులు, 10 మంది మృతి

Sweden: స్వీడన్‌లోని పాఠశాలలో కాల్పులు, 10 మంది మృతి
x
Highlights

Sweden: సెంట్రల్ స్వీడన్‌లోని ఒక పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో ఇంకా...

Sweden: సెంట్రల్ స్వీడన్‌లోని ఒక పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు.ఈ కాల్పులు ఒరెబ్రో శివార్లలో జరిగాయి. ఈ ఆకస్మిక సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పులు జరిగిన ప్రదేశం స్టాక్‌హోమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసు చీఫ్ రాబర్టో ఎడ్ ఫారెస్ట్ తెలిపారు.

కాల్పులు పాఠశాల (భవనం) లోపల జరిగాయా లేదా మరెక్కడైనా జరిగాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. ఈ కాల్పులు జరిగిన పాఠశాలలో 20 ఏళ్లు పైబడిన వారు చదువుతున్నారు. ఈ పాఠశాల పేరు క్యాంపస్ రిస్బర్గ్స్కా. ఈ విషయంలో ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ప్రకటన వెలువడింది. ఇది మొత్తం స్వీడన్‌కు చాలా విచారకరమైన రోజు అని ఆయన అన్నారు.

.

Show Full Article
Print Article
Next Story
More Stories