కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం, 30 మందికి గాయాలు

10 Killed 30 Injured After Massive Fire At Cambodia Casino
x

కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం, 30 మందికి గాయాలు

Highlights

Cambodia: క్యాసినో సెంటర్‌లో చెలరేగిన మంటలు

Cambodia: థాయ్‌లాండ్ సరిహద్దులోని కాంబోడియాన్ హోటల్ క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమైనట్టు పోలీసులు తెలిపారు. పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్‌లో గత అర్థరాత్రి 11:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో క్యాసినోలో సుమారు 400 మంది వరకు పనిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల జనం భయంతో వణికిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories