Top
logo

గద్దెనెక్కిన బీజేపి అయిదేళ్లు తిరిగేసరికి ఎందుకు వాడిపోయింది?

గద్దెనెక్కిన బీజేపి అయిదేళ్లు తిరిగేసరికి ఎందుకు వాడిపోయింది?
X
Highlights

2019 ఎలక్షన్ వార్ హీటెక్కుతోంది. పట్టునిలబెట్టుకోడానికి బీజేపీ పవర్ సంపాదించడానికి కాంగ్రెస్ జోరుగా ప్రచారం...

2019 ఎలక్షన్ వార్ హీటెక్కుతోంది. పట్టునిలబెట్టుకోడానికి బీజేపీ పవర్ సంపాదించడానికి కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి.. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ ఇప్పుడు మోడీ ఔర్ ఏక్ బార్ అంటూ నినాదాన్ని మార్చేసింది.. ఇక ఈసారి పవర్ పక్కా అంటున్న కాంగ్రెస్ మాత్రం గెలుపు వ్యూహాల కన్నా ప్రత్యర్ధిని కార్నర్ చేయడంపైనే దృష్టి పెట్టింది గత ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో గద్దెనెక్కిన బీజేపి అయిదేళ్లు తిరిగేసరికి ఎందుకు వాడిపోయింది? ఇప్పుడు మెజార్టీ కాదు.. పట్టు దొరికితే చాలని ఎందుకనుకుంటోంది?

గత ఏడాది మిషన్ 272+ ( టూ సెవెంటీ టూ ప్లస్) నినాదంతో బరిలోకి దిగిన బీజేపి అయిదేళ్ల తర్వాత నినాదం మార్చేసింది.. కాన్ఫిడెన్స్ స్థానంలో కాంప్రమైజ్ కనిపిస్తోంది.. ఒకప్పుడు మిత్ర పక్షాలను గడ్డి పోచల్లా తీసి పారేసిన మోడీ ఇప్పుడు స్నేహ గీతం ఆలపిస్తున్నారు..అయిదేళ్ల పాలనలో జరిగిన మార్పులేంటి? తేడా ఎక్కడొచ్చింది?

2019 ఎన్నికలు దేశంలో ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. రాహుల్ ఎగ్రెసివ్ గా దూసుకు పోతున్నారు.. రాఫెల్ డీల్ వివాదంపైనా, బాలాకోట్ దాడులపైనా కాంగ్రెస్ పార్టీ చేయగలిగినంత రచ్చ చేసేసింది. మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఆ పార్టీ చాలా గట్టిగా కృషి చేస్తోంది. తన మేజిక్ రాను రాను తరిగిపోతోందని, 2019 సీన్ 2014 లాగా లేదని తెలుసుకున్న మోడీ నెమ్మదిగా తన స్టైల్ మార్చుకున్నారు..అందుకే తన నినాదాన్ని హిందూత్వ నుంచి అభివృద్ధి వైపు మార్చారు.2014లో ఆయన ఇమేజ్ గుజరాత్ సీఎం గా మాత్రమే పరిచయం..కానీ నేడు యవద్భారతం మెచ్చిన నేతగా ఎదిగారు.. ఇక ఇప్పుడు మరోసారి తన ఇమేజ్ ను మార్చుకుంటున్నారు.. ఉద్రేక పూరిత ప్రసంగాల నుంచి అభివృద్ధి కోణం ప్రసంగాలు వినిపిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలకు, కూటములకు సన్నిహితంగా ఆయన అడుగులు పడుతున్నాయి. 2014లో మిషన్ 272+ నినాదంతో బీజేపీ అడుగులేసింది. బీజేపీ సొంతంగా 272 సీట్లు సాధించాలన్నది అప్పటి మిషన్ టార్గెట్. కానీ బీజేపి 282 సీట్లు గెలిచి మిత్రుల అవసరం లేకుండానే సంపూర్ణ మెజారిటీని సాధించింది. అయినా ముందు చూపుతో వ్యవహరించిన మోడీ మిత్రులతో కలిపే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు మిషన్ 272 మైనస్ తమకు కాదు మిత్రులకూ సీట్లను పంచాలని తాపత్రయపడుతోంది.అందుకే 2019 లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తులు, సీట్ల సర్దుబాట్లు మొదలు పెట్టింది. గత ఎన్నికల నాటికి మోడీ, అమిత్ షాల జోడీ హిట్ పెయిర్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత కాలంలో వారు చూపిన దూకుడు ఈ జంటను దూరం పెట్టాలన్న భావన సీనియర్లలో పెంచింది. అదే టైమ్ లో సంఘ్, ఇతర సంస్థలు నితిన్ గడ్కరీ పేరును పరిశీలించడం మొదలు పెట్టాయి. మాట వినని మోడీ కన్నా గడ్కరీ బెటర్ అన్న సంకేతాలూ స్పష్టంగా కనిపించాయి. ప్రతిపక్షాలు సైతం గడ్కరీ తీరును ప్రశంసించాయి.. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను సైతం మోడీ బీజేపీ అంతర్గత సమావేశాల్లోనూ, కేబినెట్ మీటింగుల్లొనూ చెప్పకుండా నేరుగా ప్రకటించారు.

పేరుకే ఎన్డీఏ ప్రభుత్వం అయినా పెత్తనమంతా మోడీ, అమిత్ షాలదే మోడీ కేబినెట్లో ఆయన తీరుకు చిన్న పార్టీలు సైతం అల్లాడి పోయాయి మిత్రులను చిన్న చూపు చూడటంపై మండిపడ్డాయి. పీడీపీ, శివసేన అందుకే దూరం జరిగాయి. ఒకానొక దశలో మోడీ ఒకే జాతి, ఒకే ఎన్నిక నినాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు. రాష్ట్రాలు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిపి దేశమంతా గెలిచి అఖండ భారతానికి రారాజుగా వెలిగిపోవాలని కలలు కన్నారు.

Next Story