కశ్మీర్ విషయంలో ఎప్పుడేం జరిగింది?

కశ్మీర్ విషయంలో ఎప్పుడేం జరిగింది?
x
Highlights

భారత్-పాకిస్తాన్‍‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. స్వాతంత్య్రం వచ్చిన రెండు నెలల నుంచే ఇరుదేశాల మధ్య కశ్మీర్ విషయంలో ఎడతెగని వివాదం...

భారత్-పాకిస్తాన్‍‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. స్వాతంత్య్రం వచ్చిన రెండు నెలల నుంచే ఇరుదేశాల మధ్య కశ్మీర్ విషయంలో ఎడతెగని వివాదం నడుస్తోంది.అక్టోబర్ 1947: భారత్, పాకిస్తాన్‌లు విడిపోయిన రెండు నెలల్లోనే ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది.ఆగస్టు 1965: కశ్మీర్‌పై మరోసారి ఈ రెండుదేశాలూ యుద్ధానికి దిగాయి.

డిసెంబరు 1971: తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఇస్లామాబాద్ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల పోరాటానికి మద్దతునిచ్చి, స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్ సహకరించింది. పాకిస్తాన్ భూభాగంలో భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఈ యుద్ధం ముగిసింది.1989: కశ్మీర్‌ లోయలో భారత పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు మొదలైంది.

ఫిబ్రవరి 1999: భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు లాహార్‌కు బస్సుయాత్ర చేసి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశయ్యారు.మే 1999: కార్గిల్ పర్వతప్రాంతంలో భారత సైనిక శిబిరాలను పాకిస్తాన్ సైనికులు, మిలిటెంట్లు ఆక్రమించారు. దీంతో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా భారత్ వైమానిక, భూతల దాడులకు దిగి, ఆక్రమణలను తిప్పికొట్టింది.మే 2001: భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆగ్రాలో సమావేశమైనా ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఆ సమావేశం ముగిసింది.

అక్టోబర్ 2001: శ్రీనగర్‌లోని కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38మంది చనిపోయారు.డిసెంబరు 13, 2001: భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో 14మంది చనిపోయారు.ఫిబ్రవరి 2007: పాకిస్తాన్, భారత్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుపై జరిగిన బాంబు దాడిలో 68 మంది మరణించారు.జనవరి 26, 2008: ముంబయి రైల్వే స్టేషన్, హోటల్‌, ఓ యూదు సాంస్కృతిక కేంద్రంపై 60 గంటలపాటు జరిగిన మిలిటెంట్ దాడిలో 166 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తాయిబానే కారణమని భారత్ ఆరోపించింది.జనవరి 2016: పఠాన్‌కోట్‌లోని భారత వాయుసేన శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు.

సెప్టెంబర్ 18, 2016: కశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు మరణించారు.సెప్టెంబర్ 30, 2016: పాక్ పాలిత కశ్మీర్లోని మిలిటెంట్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించినట్లు భారత్ ప్రకటించింది. అయితే దీన్ని ఇస్లామాబాద్ తోసిపుచ్చింది.ఫిబ్రవరి 14, 2019: కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన మిలిటెంట్ ఆత్మాహుతిదాడిలో 40కి పైగా జవాన్లు మరణించారు. ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది.ఫిబ్రవరి 26, 2019: పాకిస్తాన్‌లోని కశ్మీరీ మిలిటెంట్ శిబిరాలపై వైమానిక దాడులు చేసినట్లు, శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories