మహానగర ఓటర్ల మొగ్గు ఎటు?

మహానగర ఓటర్ల మొగ్గు ఎటు?
x
Highlights

మహానగర ఓటర్లు ఎటు వైపు? 2014 ఎన్నికల్లో కమలానికి చేయూతనిచ్చిన ఓటర్లు ఇప్పుడేమనుకుంటున్నారు? ఆరు రాష్ట్రాల్లో క్వీన్‌స్పీప్‌ చేసిన...

మహానగర ఓటర్లు ఎటు వైపు? 2014 ఎన్నికల్లో కమలానికి చేయూతనిచ్చిన ఓటర్లు ఇప్పుడేమనుకుంటున్నారు? ఆరు రాష్ట్రాల్లో క్వీన్‌స్పీప్‌ చేసిన బీజేపీ...ఇప్పుడెలాంటి వ్యూహాలను అమలు చేస్తోంది.? కాంగ్రెస్‌ ఎలాంటి ఎత్తుగడులకు ప్లాన్‌ చేస్తోంది.? ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటున్నా ఎవరు వస్తే తమకు మేలు జరుగుతుందో ఆలోచించి తీర్పు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలకు పట్టం కడితేనే మేలు జరుగుతుందని కొన్ని నగరాల్లో భావిస్తుండగా జాతీయ పార్టీలతోనే ప్రగతి సాధ్యమని మరికొన్ని చాటుతున్నాయి. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, విశాఖపట్నం.. కీలకంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో మోడీ గాలి వీయడంతో ఢిల్లీ, ముంబయి బెంగళూరు, విశాఖపట్నం, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లో కొంత భాగం బీజేపీకే ఓటేశాయి. కోల్‌కతా, చెన్నైలలో ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. చదువుకున్న యువత, ఉద్యోగులు ఎక్కువగా ఉండడం, ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన నగర ఓటర్లు ఇప్పుడు ఎటువైపు నడుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం కీలకంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా దత్తాత్రేయ గెలిచారు. బీజేపీ పొత్తుతో మల్కాజిగిరి నుంచి టీడీపీ అభ్యర్థి సీహెచ్‌ మల్లారెడ్డి గెలిచారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాలున్నాయి. ఇందులో సికింద్రాబాద్‌లో గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి గట్టి పోటీ ఉండటంతో బీజేపీ గెలుపు అంత సులువేమీ కాదన్నది అంచనా. 2014లో విశాఖ ఎంపీగా కంభంపాటి హరిబాబు గెలిచారు. ప్రస్తుతం ఇక్కడ పురందేశ్వరి పోటీ చేశారు.

వాయిస్5: దేశ రాజధాని ఢిల్లీ 2014లో కమలం వెంట నడిచింది. ఇక్కడ ఏడు లోక్‌సభ స్థానాలున్నాయి. చాందినీచౌక్‌, న్యూ ఢిల్లీ, తూర్పు, ఈశాన్య, వాయువ్య, దక్షిణ, పశ్చిమ స్థానాల్లో.. అన్ని చోట్లా కమలానిదే విజయం. తర్వాత 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు 67 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం అక్కడ ఆప్‌ ప్రభుత్వం ఉంది. తాజా పరిస్థితుల్లో బీజేపీ ఏ మేరకు నెగ్గుకు రాగలుతుందన్నది పెద్ద ప్రశ్న.

కోల్‌కతాలో గత ఎన్నికల్లో ప్రాంతీయతకే ఓటేసింది. ఇక్కడ ఉన్న కోల్‌కతా ఉత్తరం, దక్షిణం స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. కోల్‌కతా తర్వాత పెద్దదైన అసన్‌సోల్‌ నగరంలో బీజేపీ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో అప్పట్లో గెలిచారు. ఈసారీ తృణమూల్‌ను దాటుకుని కోల్‌కతా, అసన్‌సోల్‌లో కమల వికాసం ఏ మేరకు సాధ్యమనేది అనుమానమే. ఇక చెన్నై నగర పరిధిలో మూడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మధ్య చెన్నై, ఉత్తర, దక్షిణ స్థానాల్లో గత ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతలే ఎంపీలుగా ఎన్నికయ్యారు. బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. చెన్నై దక్షిణ స్థానంలో మాత్రమే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి చెన్నైలో బోణీ కొట్టాలన్న లక్ష్యంతో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. జాతీయ పార్టీల ప్రభావం అంతగా ఉండని తమిళనాట బీజేపీ గెలుపు అంతసులువు కాదన్నది విశ్లేషకుల మాట.

గ్రేటర్‌ ముంబయి పరిధిలో 6 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేసి అన్నింటా గెలిచాయి. తాజా ఎన్నికల్లో మరోసారి శివసేన, బీజేపీ చేయి కలిపాయి. ఈ అయిదేళ్లలో అభివృద్ధి సాధించలేదన్న విమర్శలు బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో 2014లో 4 స్థానాల్లో 3 చోట్ల బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం కమలానికి గడ్డు పరిస్థితి ఉంది. తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటంతో వారు బీజేపీకి సానుకూలంగా లేరన్న ప్రచారం విజయావకాశాలు దెబ్బతీసేలా ఉంది. అహ్మదాబాద్‌ తూర్పు, పశ్చిమ స్థానాల్లో 2014లో బీజేపీదే విజయం. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కమలం ఖాతాలోకే వెళ్లాయి. ఈసారి ఇక్కడ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. దీనికి పక్కనే ఉన్న గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షా బరిలో ఉండటంతో ఆ ప్రభావమూ ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories