తెలంగాణ హస్తం ప్రక్షాళన ఎలా ఉండనుంది?

తెలంగాణ హస్తం ప్రక్షాళన ఎలా ఉండనుంది?
x
Highlights

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న కాంగ్రెస్...దాన్ని మరిపించడానికి, పార్లమెంట్‌ ఎన్నికలపై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టింది....

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న కాంగ్రెస్...దాన్ని మరిపించడానికి, పార్లమెంట్‌ ఎన్నికలపై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో ముఖ్యంగా గెలిచే అవకాశం ఉన్న స్థానాల బలోపేతంతో పాటు, అభ్యర్డుల వేటలో పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్‌పై గురిపెట్టింది కాంగ్రెస్. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెస్ గెలవడం, ఓడిన చోట కూడా సంప్రదాయ ఓట్లు ఘనంగా ఉండటం కలిసాచ్చె అంశాలుగా హస్తం పార్టీ లెక్కలేస్తోంది. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానం. 2014 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ గెలుపొందారు. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.

మహబూబాబాద్‌లో గెలుపు సునాయసమని భావిస్తున్న కాంగ్రెస్, ఈ గాలిని మిగతా స్థానాలపై పడేలా సంస్థాగత కసరత్తుతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. దీంతో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా ఇప్పటికే పార్టీ క్యాడర్, ఎమ్మెల్యేలు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో కుడా ఆచితూచి అడుగులేస్తోంది. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరొక్కసారి అవకాశం ఇవ్వాలా లేదా...కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అనేది ఆలోచన చేస్తోంది అధిష్టానం. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ములుగు, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలిచినప్పటికీ, కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. 2014లో అతితక్కువ ఓట్లతో కాంగ్రెస్ ఈ స్థానంలో ఓటమి పాలయ్యింది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజవర్గంలో మెజారిటి స్థానాలు దక్కించుకుంది.

అయితే, ఖమ్మం, మహబూబాబాద్‌లో గెలుపు ఖాయం అయినప్పటికీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని భర్తీ చేయడానికి, ఈ రెండు నియోజకవర్గాలపై తీవ్ర స్థాయిలో పని చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ రెండు స్థానాలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇలా మహబూబాబాద్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి తప్పేలా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories