Top
logo

క్యాలెండర్‌ ఎలా వచ్చిందో మీకు తెలుసు.. క్యాలెండర్‌ కహానీ చదవండి

క్యాలెండర్‌ ఎలా వచ్చిందో మీకు తెలుసు.. క్యాలెండర్‌ కహానీ చదవండి
X
Highlights

వివిధ సంస్కృతులలో వివిధ రకాలైన క్యాలెండర్లు ఉన్నా అందరికీ అనువుగా ఉండేలా అంతర్జాతీయంగా గ్రెగోరియన్...

వివిధ సంస్కృతులలో వివిధ రకాలైన క్యాలెండర్లు ఉన్నా అందరికీ అనువుగా ఉండేలా అంతర్జాతీయంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను పాటిస్తున్నాయి. చివరకు మనం అనుసరిస్తున్న 365.25 రోజుల క్యాలెండర్‌కు కూడా గ్రెగోరియనే రూపకర్త. పోప్ గ్రెగరీ పేరు మీద రూపొందిన ఈ క్యాలెండర్‌ని ఇప్పుడు ప్రపంచదేశాలు ఉపయోగిస్తున్నాయి. గోరియన్‌ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల. జనవరి అనే పదం జాను వరియస్ నుంచి వచ్చిందంటారు చరిత్రకారులు. జనవరి మాసాన్ని జావన్ అనే రోమన్ దేవునికి అంకింతం చేశారు. జావన్ గాడ్‌కు, రెండు తలలు ఉంటాయి. ఒక తల వెనక్కి ఉండి క్రితం సంవత్సరాన్ని చూస్తే, ఇంకొక తల ప్రస్తుతం కొనసాగుతున్న సంవత్సరం వైపు ఉంటుంది. అందుకే ఏడాది ప్రారంభం జనవరి నెలతో ప్రారంభమవతుంది.

ఫిబ్రవరి. ఈ నెల ఫిబ్రవరియన్ అనే పదం నుంచి పుట్టింది. ఫిబ్రుస్ అనే రోమన్ పండుగ ఈ నెలలో ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి అని నామకరణం చేశారు. మార్చి...మార్స్ గ్రహానికి సంకేంతంగా దీనికి మార్చి అని పేరు పెట్టారు. ఏప్రియల్. ఏప్రిలిస్ అనే పదం నుంచి వచ్చింది. ఆపిరైర్ అంటే లాటిన్‌లో తెరవడం అని అర్థం. ఈ నెలలోనే చెట్లు లేత ఆకులను, కొన్ని పువ్వులు విచ్చుకుంటాయి. అందుకే ఏప్రిల్ నామకరణం చేశారు. మే...మైయస్ అనే పదం నుంచి పుట్టింది. మైయా, రోమన్ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మైయా దేవతను వృద్ధికి దేవతగా ఆరాధిస్తారు. జూన్....జునియస్ అనే పదం నుంచి వచ్చిందిది. జూన్‌కు రెండు అర్థాలున్నాయి. రోమన్లలో ఒక వంశం పేరు జూనియస్, ఇంకొక కారణం జూనో దేవత పేరు.

ఇక జులై కథ. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ అనే రాజు పేరు నుంచి దీన్ని గ్రహించారు. ఈ నెలను క్వింటిలిస్‌గా వ్యవహరించేవారు. క్వింటస్ అనగా ఐదు అని అర్థం. రోమన్ క్యాలెండర్‌లో జులై 5వ నెలగా ఉండేది. ఆగస్టు....రోమన్ చక్రవర్తి ఆగస్టీన్ పేరు మీద వచ్చిందే ఆగస్టు. సెప్టెంబర్ మాసం. సెప్టెమ్ అనే పదం ఆధారంగా దీనికా పేరు పెట్టారు. సెప్టెమ్ అంటే ఏడు. రోమన్ క్యాలెండర్‌లో ఇది ఏడవ నెలగా పాటించేవారు. అందుకే ఈ పేరు. అక్టోబర్...అక్టో అనే పదం నుంచి వచ్చింది. అక్టో అనగా 8. రోమన్ క్యాలెండర్‌లో ఎనిమిదవ నెల. నవంబర్...నవమ్ అనే పదం ఆధారంగా ఈనెలకు ఆ పేరు వచ్చింది. నవమ్ అంటే 9. రోమన్ క్యాలెండర్‌లో 9వ నెల. డిసెంబర్...డిసెమ్ అనే పదం నుంచి పుట్టింది. డిసెమ్ అంటే 10. రోమన్ క్యాలెండర్‌లో 10వ నెల.

ఇక ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుందంటారు విశ్లేషకులు. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్‌లో సెప్టెంబరు మాసం ఏడవది కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే అక్టోబరు - అష్ట, నవంబరు - నవ, డిసెంబరు - దశ... ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి. క్యాలెండర్‌లు ఎన్నున్నా కాలమొకటే. కాల ప్రవాహంలో మరో ఏడాది ముగుస్తోంది. మారేది క్యాలెండరే కానీ జీవితం కాదు. మార్చుకోవాల్సింది మనమే. అది మంచో, చెడో. మొత్తానికి ఎన్నో జ్ణాపకాలనిచ్చిన 2018.... కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది 2019 ఆ ఆశలను మోసుకొచ్చింది.

Next Story