క్రీడారంగంలో మధుర జ్ఞాపకాల 2018

క్రీడారంగంలో మధుర జ్ఞాపకాల 2018
x
Highlights

భారత క్రీడారంగ చరిత్రలో 2018వ సంవత్సరం.. అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్ లతో...

భారత క్రీడారంగ చరిత్రలో 2018వ సంవత్సరం.. అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్ లతో పాటు...కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో సైతం నవతరం అథ్లెట్లు సత్తా చాటడం ద్వారా భారత క్రీడారంగానికి అంతర్జాతీయంగా గౌరవం తెచ్చారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రమే కాదు...జకార్తా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో సైతం భారత నవతరం అథ్లెట్లు అసాధారణంగా రాణించారు. భారత క్రీడారంగానికి పలు మధురజ్ఞాపకాలను మిగిల్చారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 72 దేశాల కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు.తమ దేశానికి...పతకాలపట్టికలో సముచిత స్థానం కల్పించారు.

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 221 మంది అథ్లెట్లతో...15 రకాల క్రీడల బరిలోకి మాత్రమే దిగింది. అయితే...భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించడం ద్వారా... 26 స్వర్ణాలతో సహా మొత్తం 66 పతకాలు అందించారు. దీంతో భారత్ పతకాల పట్టిక మూడోస్థానంలో చోటు సంపాదించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల తర్వాతిస్థానంలో నిలిపారు.

ఇక అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్లో మాత్రం...భారత్ నిలకడగా రాణిస్తూ...ప్రపంచ నంబర్ వన్ జట్టుగా తన ఆధిపత్యాన్ని చాటుకోడమే కాదు...స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగింది. భారత్ లో క్రికెట్టే నంబర్ వన్ గేమ్.శతకోటి భారత క్రీడాభిమానులకు క్రికెట్ ను మించిన పిచ్చి మరొకటి లేదు. టెస్ట్ క్రికెట్లో మాత్రమే కాదు...యాభై ఓవర్ల వన్డే క్రికెట్లో సైతం భారత్ తిరుగులేని విజయాలతో సిరీస్ వెంట సిరీస్ గెలుచుకొంటూ...ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా నిలిచింది. విరాట్ కొహ్లీ...ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు మార్మోగిపోతున్న ఏకైక పేరు. టెస్ట్ క్రికెట్...వన్డే క్రికెట్...టీ-20 క్రికెట్ ..ఫార్మాట్ ఏదైనా...పరుగుల సాధనలో విరాట్ కొహ్లీకి కొహ్లీ మాత్రమే సాటి.

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ లో సైతం భారతజట్టు సత్తాచాటుకొంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో...వారేవ్వా అనిపించుకొంది. వెటరన్ మిథాలీ రాజ్ సైతం...టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది. జాతీయ క్రీడ హాకీలో మాత్రం...భారత్ పరిస్థితి నాలుగడుగులు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ప్రపంచ మొదటి ఐదు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ నిలిచింది. క్రికెట్, హాకీ, షూటింగ్, ఫుట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, ట్రాక్ అండ్ ఫీల్డ్...ఇలా క్రీడలు ఏవైనా...భారత్ లోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు...బంగారు పతకాలు సాధించి...తమదేశానికి వన్నె తెచ్చారు. వచ్చే ఒలింపిక్స్ లో దేశానికి ఏదో ఒక పతకం సాధించే సత్తా, తెగువ తమలో ఉన్నాయని...2018 సీజన్లో సాధించిన విజయాలతో చాటి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories