Top
logo

ప్రధాని X మాజీ కానిస్టేబుల్‌..

ప్రధాని X మాజీ కానిస్టేబుల్‌..
Highlights

వారణాసిలో వార్ వన్ సైడ్ కాదంటున్నాయి విపక్షాలు ఒకే ఒక్కడిని ఓడించడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలన్నీ...

వారణాసిలో వార్ వన్ సైడ్ కాదంటున్నాయి విపక్షాలు ఒకే ఒక్కడిని ఓడించడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. మైభీ చౌకీదార్ అంటున్న మోడీకి మరో చౌకీదార్ ను దీటుగా నిలబెట్టి సై అంటే సై అంటోంది సమాజ్ వాదీ పార్టీ ఓ పక్క రైతుల సెగ మరోవైపు ఘట్ బంధన్ ఎత్తుగడలు ఈ పద్మవ్యూహం నుంచి మోడీ గెలుపు అంత వీజీ కాదని తెలియ చేస్తున్నాయి పరిస్థితులు.

ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి ఎన్నిక చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. మరోసారి భారీ మెజారిటీతో గెలిచి బీజేపీకి కొత్త కిక్కు ఇవ్వాలని మోడీ టీమ్ గ్రౌండ్ వర్క్ చేస్తుంటే.. మరోవైపు దేశవ్యాప్తంగా రైతులు,ఫ్లోరోసిస్ బాధితులు మోడీకి తీవ్రంగా ఎదురు తిరుగుతున్నారు. వీళ్లకి తోడు సమాజ్ వాదీ పార్టీ వ్యూహాత్మకంగా తమ అభ్యర్ధిని మార్చింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ దేశ భక్తిని అడ్డగోలుగా వాడేసుకుంటున్న మోడీకి చెక్ చెప్పడానికి సమాజ్ వాదీ పార్టీ కొత్త ఐడియా వేసింది. నిన్నటి వరకూ శాలినీ యాదవ్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించిన ఎస్పీ ఇవాళ ఓ మాజీ బీఎస్ ఎఫ్ జవాన్ ను రంగంలోకి దింపింది. గతంలో ఆర్మీలో సప్లయ్ చేస్తున్న ఫుడ్ దారుణంగా ఉందని విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ ను మోడీకి కౌంటర్ గా మహా ఘట్ బంధన్ అభ్యర్ధిగా బరిలోకి దింపింది. మోడీ చౌకీదార్ నినాదానికి దీటుగా తానే అసలు చౌకీదార్ నని తేజ బహదూర్ యాదవ్ సవాల్ విసురుతున్నాడు.

దేశ సరిహద్దుల్లో 21 ఏళ్ల పాటూ సేవలందించిన తనకే చౌకీదార్ పదం వాడే అర్హత ఉందని అంటున్నాడు తేజ్ బహదూర్ హర్యానాకు చెందిన తేజ్ బహదూర్ ఆర్మీలో సరిహద్దు జవాన్లకు పరమ దరిద్రమైన ఫుడ్ పెడుతున్నారంటూ వరుసగా నాలుగు వీడియోలు పోస్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఆర్మీలో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో విధినిర్వహణలో ఉన్న తమకు ఒక పరాఠా టీ ఇస్తున్నారని కూర గానీ, పచ్చడి గానీ ఇవ్వడం లేదనిప్రధాని X మాజీ కానిస్టేబుల్‌

11 గంటల పాటూ నిలబడి ఉద్యోగం చేసే తమకు బలవర్ధక ఆహారం ఇవ్వడం లేదని వాపోయాడు.. లంచ్ లో ఇచ్చే పప్పులో మొత్తం పసుపు, ఉప్పు తప్ప మరేం ఉండదని దీనిపై దర్యాప్తు చేయాలనీ కోరాడు. తేజ్ బహదూర్ ఆరోపణలపై అప్పట్లో విచారణకు ఆదేశించిన ఆర్మీ చీఫ్ ఆ మాటలు అబద్ధాలని కొట్టి పారేస్తూ ఆయన్ను విధుల నుంచి తొలగించారు. అలాంటి తేజ్ బహదూర్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. వారణాసిలో మొదట ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన తేజ్ బహదూర్ సమాజ్ వాదీ మద్దతుతో ఆ పార్టీ అభ్యర్ధిగా మారాడు.

సమాజ్ వాదీపార్టీ ఇచ్చిన ఈ కొత్త ట్విస్టుకు తోడు రైతులు కూడా మోడీపై కక్ష కట్టారు. తమిళనాడు రైతులు వారణాసి నుంచి మోడీకి వ్యతిరేకంగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తుంటే వారికి తెలంగాణ రైతులు జతకలిశారు. పసుపు పంటకు బోర్డు కోసం పోరాడి పోరాడి విసిగి వేసారిన నిజామాబాద్ రైతులు మోడీపై వారణాసి నుంచి బరిలో నిలిచేందుకు అక్కడకి వెళ్లారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో వారికి అడ్డంకులు కల్పిస్తూ నగరం నుంచి తరిమి కొడుతోంది. ఎవరైనా అభ్యర్ధి నామినేషన్ వేయాలంటే కనీసం పదిమంది ప్రతిపాదకులు మద్దతు తెలపాలి.. వారు స్థానికులై ఉండాలి. వారణాసిలో తమిళనాడు రైతులకు స్థానికంగా ఎవరూ సహాయ పడకుండా యోగీ ఆదిత్య నాథ్ సర్కార్ ఎక్కడికక్కడ అడ్డు పుల్లలు వేసేస్తూ వారిని చెదరగొడుతోంది.


Next Story