రాహుల్ గెలుపు సునాయాసమేనా? లేక ఏటికి ఎదురీదుతున్నారా?

రాహుల్ గెలుపు సునాయాసమేనా? లేక ఏటికి ఎదురీదుతున్నారా?
x
Highlights

అయిదవ దశ పోలింగ్ ఎదుర్కొంటున్న వీఐపీ నియోజక వర్గాల్లో అమేథీ ఒకటి 15 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ ఈ సారి ఎవరి పరమవుతుంది? రాహుల్ గెలుపు...

అయిదవ దశ పోలింగ్ ఎదుర్కొంటున్న వీఐపీ నియోజక వర్గాల్లో అమేథీ ఒకటి 15 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ ఈ సారి ఎవరి పరమవుతుంది? రాహుల్ గెలుపు సునాయాసమేనా? లేక ఏటికి ఎదురీదుతున్నారా? దశాబ్దాలుగా ఇందిర కుటుంబంపై మమకారం పెంచుకున్న అమేథీ వాసులు ఇప్పుడేమంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికలు అమేథీలో హై టెన్షన్ పెంచుతున్నాయి. దశాబ్దాలుగా ఇందిర కంచుకోటగా నిలబడిన ఈ నియోజక వర్గం ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమేధీలో పదిహేనేళ్లుగా గెలుపు ఏకపక్షమే కానీ గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారుతున్నాయి. వార్ వన్ సైడ్ అన్నది కాస్తా.. టైట్ ఫైట్ అనే స్థితికి చేరుకుంది. రాహుల్ అమేధీకి 15 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఆ నియోజక వర్గానికి ఏం చేయలేదన్న అసంతృప్తి ఆ ప్రాంత ప్రజల్లో ఉంది.. అయినా సరే.. ఈసారీ రాహుల్ నే ఎన్నుకుంటాం అంటున్నారు అక్కడి ప్రజలు.. రాహుల్ మాకేం చేయకపోయినా గాంధీల కుటుంబానికి ఈ ప్రాంతం ఎప్పుడూ అండగా ఉంటుంది. అది మా బాధ్యత.. రాహుల్ కు ఇప్పుడు మా మద్దతు అత్యవసరం ఆయన వెంట నిలబడటం నైతికంగా మా బాధ్యత అంటున్నారు అమేథీ వాసులు గాంధీ, నెహ్రూ కుటుంబానికి అమేథీతో ఓ ఉద్వేగపూరితమైన అనుబంధం ఉందంటున్నారు స్థానికులు.

ఏ అభ్యర్ధి అయినా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రతిష్టలు, పని మంతుడన్న గుర్తింపు ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉన్నా గెలుపు సునాయాసంగా సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇదే విషయం నిజమని నిరూపించారు. కానీ రాహుల్ పరిస్థితి వేరు ఆయనే పార్టీ అధిపతి.. పదేళ్లుగా యూపీఏలో ఆయన మాటే ఫైనల్ ఆ పదేళ్లు కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ అధికారంలో ఉన్నాయి. ఈ రెండూ యూపీఏకి బయట నుంచి మద్దతు పలికిన పార్టీలే అయినా ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం.అయిదు అసెంబ్లీ సిగ్మెంట్లున్న ఈ ప్రాంతంలో కనీసం ఒక డీసెంట్ హోటల్ కూడా లేదు. నాలుగు దశాబ్దాలుగా ఇది వివిఐపీ నియోజక వర్గం అయినా ఇక్కడ విఐపీలు వస్తే కనీసం ఉండటానికి సరైన వసతి లేదు. ఎక్కడా పేరొందిన కట్టడాలు లేవు. సంజయ్ గాంధీ తొలిసారి పోటీ చేయడానికి వచ్చిన నాటినుంచి నేటి వరకూ అక్కడ ఇదే పరిస్థితి..

కానీ అమేథీలో పాతతరం వారు మాత్రం నెహ్రూ, గాంధీ కుటుంబంపై చాలా అనుబంధం పెంచుకున్నారు. అక్కడ ఇందిర కుటుంబంతోనే అభివృద్ధి జరిగిందని, సంజయ్ గాంధీ ఆస్పత్రి, హాల్ సంస్థ ఏర్పాటు, సమీప కాలువ అభివృ్ధి పనులను రాజీవ్ గాంధీ చేపట్టారని గొప్పగా చెబుతుంటారు.. తర్వాత రాహుల్ అక్కడ ఎంపీగా గెలిచిన నాటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం కూడా చేపట్టలేదని కాంగ్రెస్ వాదులే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. రాహుల్ వరుసగా నాల్గోసారి ఇక్కడ నుంచి పోటీకి దిగుతుంటే ఈ నియోజక వర్గానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉంది పార్టీ.

Show Full Article
Print Article
Next Story
More Stories