పబ్జీ... ఎందుకింత డేంజర్ గేమ్.. అసలు కథ ఇది!

పబ్జీ... ఎందుకింత డేంజర్ గేమ్.. అసలు కథ ఇది!
x
Highlights

దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్ ఇది.. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని గేమ్ లో ప్రవేశించగానే...

దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్ ఇది.. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని గేమ్ లో ప్రవేశించగానే ఒక ఐడీ వస్తుంది.. పబ్జీ గేమ్ గ్రూప్ గా ఆడే గేమ్.. ఎంతమంది గేమ్ లో టీమ్ లో ఉండాలో ముందే నిర్ణయించుకుంటారు. గ్రూప్ వాయిస్ గేమ్ కా వడంతో ముక్కూ మొఖం తెలియని వారు సైతం ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులు బాటు యాప్ లో ఉంటుంది. గేమ్ లో గరిష్టంగా వంద మంది ఆడొచ్చు.. ఇది ఆడేందుకు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగిలిన వారంతా శత్రువులే. యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్ లు, బంకర్ సదుపాయాలు కూడా ఉంటాయి. ఎదుటి వాడిని చంపేసే గేమ్ కావడంతో గేమ్ మొదలైంది మొదలు ఒకరకమైన ఉన్మాదంలో మునిగి తేలుతారు యువత..క్రమేణా అది వ్యసనంగా మారుతుంది.

పబ్జీ గేమ్ ని ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఆడుతున్నారు.రోజులో ఏ సమయంలో చూసినా కనీసం మూడు, నాలుగు కోట్ల మంది ఆన్ లైన్ గేమ్ లోనే ఉంటారు..అదీ దీనికున్న క్రేజ్.. పబ్జీ గేమ్ లో తనకు ఆడే స్కోప్ ఇవ్వలేదని ఓ ఆటగాడు మరో ఆటగాడిని ఇంటికెళ్లి మరీ చావగొట్టాడు.. జమ్మూ కశ్మీర్ పబ్జీ గేమ్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది. అక్కడ పదో తరగతి ఫలితాలు దారుణంగా రావడంతో గేమ్ ను రాష్ట్రంలో నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.ఇక గుజరాత్ లోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. అక్కడ స్కూళ్లలో ఈ గేమ్ ను నిషేధించారు. పిల్లలు స్కూళ్లకు మొబైల్స్ తీసుకు రాకూడదని ఆదేశించారు. అసలీ గేమ్ ను దేశంలోనే నిషేధించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. హాస్టళ్లలో, తల్లి దండ్రుల నియంత్రణలోలేని పిల్లల్లో పబ్జీ ఒక వ్యసనంలా మారుతోంది. చదువు మానేసి ఈ గేమ్ లోనే మునిగి తేలుతున్నారు. తినడం, పడుకోడం, దైనందిన కార్యకలాపాలు సైతం మానేసి గేమ్ ధ్యాసలో పడి మునిగి తేలుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఈ గేమ్ ఆడి ఆడి ఒక్క సారి కూడా గెలవని ఓ యువకుడు పిచ్చి వాడిలా మారిపోయాడు.. డిప్రెషన్ లోకి వెళ్లి రోడ్ల వెంట తిరుగుతూ.. చేతిలో గన్ ఉందన్న ఫీలింగ్ లో స్వైర విహారం చేశాడు. స్కూలు పిల్లల శారీరక, మానసిక వికాసంపై దెబ్బ కొడుతున్న ఈ గేమ్ ను దేశంలోనే నిషేధించాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ పోరాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories