పంచాయతీలపై పట్టు కోసం వాడిన పాచికలేంటి?

పంచాయతీలపై పట్టు కోసం వాడిన పాచికలేంటి?
x
Highlights

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయ దుందిభి మోగించారు. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మెజార్టీ పంచాయతీలను...

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయ దుందిభి మోగించారు. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మెజార్టీ పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామసంగ్రామంలోనూ కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ మరోసారి అదే దూకుడుని కొసాగించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. 4వేల 470 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగ్గా.. అధికార టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 2629 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 920 స్థానాల్లో విజేతలుగా నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 750కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఎం 32 స్థానాల్లో గెలుపొందాయి.

ఏకగ్రీవంతో కలిపి తొలివిడతలో మొత్తం 4వేల 470 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ మద్దతుదారులు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 166 పంచాయతీల్లో సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సైతం నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 90 పంచాయతీల్లో సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లాలో స్వతంత్రులు 104 పంచాయతీల్లో గెలుపొందారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. మొదట వార్డు సభ్యుల అభ్యర్థులకు, తర్వాత సర్పంచ్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. చివరిగా ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించారు. ఎన్నికల నియమావళి ప్రకారం, మెజార్టీ సభ్యుల మద్దతు లభించిన వారికే ఉప సర్పంచ్ పదవి వరించింది. పెద్ద పంచాయతీల్లో రాత్రి 10 తర్వాతే ఫలితాలు వెలువడ్డాయి. పలుచోట్ల అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షించారు. భారీ భద్రత మధ్య తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ఎన్నికలు ఈ నెల 25న, మూడో విడుత ఎన్నికలు 30న జరుగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories