పల్లె పంచాయతీ ఏమంటోంది... అధికారం ఎవరి సొంతం కాబోతోంది?

పల్లె పంచాయతీ ఏమంటోంది... అధికారం ఎవరి సొంతం కాబోతోంది?
x
Highlights

గ్రామాలు మన దేశానికి వెన్నెముక లాంటివి.. ఎందుకంటే ఎంత పెద్ద ఆకాశ హర్మ్యం కైనా కింద వున్న పునాదే కీలకం.. అది సరిగా వుంటేనే భవనం నిలబడుతుంది. దేశం...

గ్రామాలు మన దేశానికి వెన్నెముక లాంటివి.. ఎందుకంటే ఎంత పెద్ద ఆకాశ హర్మ్యం కైనా కింద వున్న పునాదే కీలకం.. అది సరిగా వుంటేనే భవనం నిలబడుతుంది. దేశం సుభిక్షంగా, పటిష్టంగా, పురోగామ పథంలో పయనించాలంటే గ్రామాలు బాగుండాలి. పంచాయతీల పరిపాలన బాగుండాలి. మరి తాజాగా మోగిన పంచాయతీనగారాతో తెలంగాణ మరో రాజకీయ సంగ్రామం మొదలుకాబోతోందా... రచ్చబండ రాజకీయాలు ఏం చెబుతున్నాయి? తెలంగాణలో పంచాయతి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏరోజుకు ఆరోజే ఓటింగ్‌ అయిపోయిన వెంటనే కౌంటింగ్‌ మొదలు కానుంది. మొత్తానికి తెలంగాణ పల్లెల్లో రచ్చబండ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల ప్రత్యేకత ఏంటి? సర్పంచి పదవి కోసం పోటీ చేసే అభ్యర్థులు ధారవతు ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది. ఈసారి నోటా ఓటు ఉంటుందా? గ్రామ రాజకీయం ఏం చెబుతుంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో కోలాహలం నెలకొంది. ఈసారి ఏర్పాటైన పంచాయతీల్లో గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో ఆయా తండాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈసారి పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో నిర్వహించనుండటంతో పాటు ఈసారి పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు కూడా ఉంటుంది. ఉపసర్పంచ్‌ను చేతులు ఎత్తడం ద్వారా పాత పద్ధతిలోనే ఎన్నుకుంటారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్‌ ఎన్నిక అదే రోజు సాధ్యంకాకుంటే మరుసటి రోజు నిర్వహిస్తారు.

అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకుండానే పంచాయతీ ఎన్నికలు ముంచుకురావడంతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీల విభజన వల్ల పంచాయతీల సంఖ్య పెరగడంతో పదవులు కూడా పెరిగాయని నాయకులు సంబరపడుతున్నారు. ఈసారి ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్ ఉంటుందనే ప్రచారంతో చాలా మంది గిరిజనేతర ప్రముఖులు పంచాయతీ బరిలోకి దిగి గ్రామ పాలనపై పట్టు పెంచుకుందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులు ఎత్తులు, పొత్తులతో వ్యూహరచనలు చేస్తున్నారు. గ్రామాల్లో జరిగే ఈ ఎన్నికలు స్థానిక రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ఠ, పలుకుబడిలతో ముడిపడి ఉండటంతో గెలుపుని సవాల్‌గా తీసుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకుండానే పంచాయతీ ఎన్నికలు రావడంతో వేడి మీద వేడి అన్నట్లుగా పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ చేసే జనరల్ అభ్యర్థి 2,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులైతే.. జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories