Top
logo

లోక్‌సభలో నిర్మలాసీతారామన్‌కు ఎందుకంత కోపం వచ్చింది!!

లోక్‌సభలో నిర్మలాసీతారామన్‌కు ఎందుకంత కోపం వచ్చింది!!
Highlights

రాఫెల్ ఆయుధాల కొనుగోలుపై కొన్నాళ్లుగా నడుస్తున్న యుద్ధం పార్లమెంటులో పతాక స్థాయికి చేరింది.కొన్నాళ్లుగా...

రాఫెల్ ఆయుధాల కొనుగోలుపై కొన్నాళ్లుగా నడుస్తున్న యుద్ధం పార్లమెంటులో పతాక స్థాయికి చేరింది.కొన్నాళ్లుగా రాఫెల్ ఒప్పందంపైనా, మోడీ పైనా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలన్నింటికీ నిర్మలా సీతారామన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.. ఒక రకంగా చెప్పాలంటే విశ్వరూపం ప్రదర్శించారు. ఆరోపణలు, ప్రత్యారోపణల జోరు పెరిగితే.. వాదోపవాదాల స్పీడు పెరుగుతుంది.. రాఫెల్ ఒప్పందంపై దీర్ఘకాలంగా ఆరోపణలెదుర్కొంటున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో అపరకాళిక అవతారమెత్తారు.. లోక్ సభలో కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం ఇచ్చిన నిర్మల దాదాపు రెండు గంటల పాటూ సుదీర్ఘంగా, ఒక రేంజ్ లో చెలరేగిపోయారు.. కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి రాహుల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై అత్యంత ఘాటుగా, మునుపెన్నడూ లేనంత ఆవేశంతో స్పందించారు.. ప్రధానిని పదే పదే చోర్ చోర్ అని సంబోధించడంపై మండి పడ్డారు. వ్యక్తుల పేర్లు తీసి స్థాయి దిగజారి విమర్శలు చేస్తున్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు.

అలాగే తనపై నిందలేయడం పైనా విరుచుకు పడ్డారు.తమకు అందరిలా ఖాన్ దాన్ లు, ఎస్టేట్ లు లేవంటూ పరోక్షంగా రాహుల్‌కి చురకలంటించారు. అలాగే రక్షణ ఒప్పందాలపైనా కొత్త నిర్వచనం ఇచ్చారు.. ఈ సభలో వ్యక్తుల అనుభవానికి, హోదాకు, పదవులకు తగిన గౌరవం లేదని, అత్యున్నత స్థాయి వ్యక్తిమీద కూడా అలవోకగా నిందలు వేసేయగలరంటూ మండిపడ్డారు. అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్టు ఇవ్వడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై విరుచుకు పడ్డారు. అనిల్ అంబానీని డబుల్ ఏ అని సంభోధిస్తూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయడంతో.. గట్టి కౌంటర్ ఇచ్చారు.. షార్ట్ కట్ పేర్లతో హేళనగా మాట్లాడటం సులభంగానే ఉంటుందని,కానీ అది రెండువైపులా పదునైన కత్తిలాంటిదనీ, ఒక్కోసారి అది వికటిస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

హాల్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వలేదని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని.. కానీ యూపీఏ హయాంలో ఆ సంస్థ నిలబడటానికి ఏం చేశారని నిలదీశారు.. ప్రధానిని ఫ్రెంచ్ ప్రధాని దొంగ అన్నారంటూ పదే పదే చెబుతున్న కాంగ్రెస్ అందుకు ప్రూఫ్ చూపాలని.. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దనీ హెచ్చరించారు. రాఫెల్ కుంభకోణంపై విమర్శలతో విసిగిపోయిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వాటన్నింటికీ ఇవాళ బదులు తీర్చుకున్నారు.. తన వాదనని, రాఫెల్ ఒప్పందాన్ని విశ్లేషిస్తూ.. పాయింట్ టు పాయింట్.. సమాధానమిచ్చి పై చేయి ప్రదర్శించారు.. పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడిన మహిళా నేతగా స్పీకర్ కితాబునందుకున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it