ఊహించని నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు... అదే మోడీ మార్క్‌

ఊహించని నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు... అదే మోడీ మార్క్‌
x
Highlights

పెద్ద నోట్ల రద్దు, పాకిస్థాన్ పై సర్జికల్ దాడులు లాంటివి అలాంటివే. పెద్ద నోట్ల రద్దు చర్య కొంత ప్రతికూలతను కలిగించింది. దాన్ని దూరం చేసే రీతిలో...

పెద్ద నోట్ల రద్దు, పాకిస్థాన్ పై సర్జికల్ దాడులు లాంటివి అలాంటివే. పెద్ద నోట్ల రద్దు చర్య కొంత ప్రతికూలతను కలిగించింది. దాన్ని దూరం చేసే రీతిలో ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ తెరపైకి వచ్చింది. ఓటర్ల జ్ఞాపకశక్తి తక్కువని అంటారు. ఇక ఇప్పుడు ఓటర్లకు గుర్తుండేది ఎన్నికలకు ముందు బడ్జెట్ తో తమకు కలిగే ప్రయోజనాలే అంటే అతిశయోక్తి కాదు. నిన్న గాక మొన్న దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందనే అంశం వార్తల్లోకి వచ్చింది. అది జనంలోకి పోకముందే మోడీ బడ్జెట్ మంత్రం ప్రజల్ని తన వైపు తిప్పుకుంది. ఇలాంటి అస్త్రాలు మరింకెన్నో తమ వద్ద ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అదే గనుక నిజమైతే....విపక్షాలకు గడ్డుకాలం తప్పదు. ఇప్పటికే ముక్క చెక్కలైన విపక్షాలు ఇక అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కొంటాయో ఎన్నికల్లో చూడాల్సిందే.

గతంలో జరిగిన వివిధ ఉపఎన్నికలు, ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం బీజేపీ ని దిద్దుబాటగా దిశగా మార్చాయి. అందులో భాగంగానే బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలకు బీజేపీ పెద్దపీట వేసింది. పట్టణ మధ్యతరగతి వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించింది. మరో వైపున అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులను ఆకట్టుకునేందుకు కృషి చేసింది. రానున్న ఐదేళ్ళ కాలంలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు పెన్షన్ స్కీమ్ తో లాభపడనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్ పథకాల్లో ఇది ఒకటి కానుంది. బడ్జెట్లో రైతులకు ప్రకటించిన సాయం నెలకు 500 రూపాయలుగా, రోజుకు 16 రూపాయలుగా మాత్రమే ఉండడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఈ కొద్దిపాటి సాయం రైతులను అవమానించడమేనని విమర్శించారు. ఆ విమర్శ ఎలా ఉన్నప్పటికీ ఐదెకరాల లోపు కోట్లాది రైతులకు కొంతసాయమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందనుంది. ఇప్పటి వరకూ ఇలాంటి పథకం తెలంగాణ, ఒడిషాలలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సాయం దేశవ్యాప్తం కానుంది. బడ్జెట్ తాయిలాలు భారీగా ఉండడంపై ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రైతులకు ఆర్థిక సాయం ప్రకటించి, మరో వైపు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వడం లాంటి చర్యలతో ఆర్థిక లోటు పెరగగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజా బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అనడంలో సందేహం లేదు. కాకపోతే ఎన్నికలు సమీపించే లోగా బడ్జెట్ తాయిలాలలో ఎన్ని ఓటర్లకు చెందుతాయన్నదే ఇప్పుడు కీలకప్రశ్నగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగానే వివిధ ప్రత్యక్ష ప్రయోజనాలు ప్రజలకు చేరాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బీజేపీ భారీస్థాయిలో ఓట్లను పొందగలుగుతోంది. ఆ తాయిలాలు ఓటర్లకు చేరకపోయినా, చేరడంలో అక్రమాలు చోటు చేసుకున్నా బీజేపీకి ఆశించిన ఫలితాలు పెద్దగా దక్కవు. రైతులకు సాయం చేయడమైనా, అసంఘటిత కార్మికులకు సాయం అందించడమైనా మార్చి లోగా జరగాలి. పార్టీల ఉద్దేశాలను పక్కనబెడితే, తాజా బడ్జెట్ లోని పలు అంశాలు ప్రజలకు మేలు చేసేవే అనడంలో సందేహం లేదు. అవి సక్రమంగా అమలైతే కోట్లాది మందికి ఆర్థిక బాధల నుంచి కొంతమేరకైనా ఉపశమనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories