భాగ్యనగర మణిహారం... మెట్రో ప్రయాణం

భాగ్యనగర మణిహారం... మెట్రో ప్రయాణం
x
Highlights

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మణిహారంలా నిలిచింది. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక మౌళిక వసతులతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రజారవాణా...

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మణిహారంలా నిలిచింది. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక మౌళిక వసతులతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ప్రజారవాణా వ్యవస్థకు నగర వాసులు జైకొట్టారు. 2018 సంవత్సరం హైదరాబాద్ మెట్రో రైలుకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.రోజూకు లక్షా 80 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చిన్న చిన్న అవాంత‌రాలు వచ్చిన‌ప్ప‌టికీ...,మొత్తంగా స‌గ‌టు సిటిజన్ ప్ర‌యాణ వేగాన్ని పెంచింది హైద‌రాబాద్ మెట్రో రైల్.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మెట్రో రైల్ ఒక స‌రికొత్త అధ్యాయం అని చెప్పాలి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న నగర వాసులకు మెట్రో ప్రయాణం ఎంతో ఊరట నిచ్చింది. సిటిజ‌న్ వేగాన్ని పెంచింది మెట్రో రైల్. గ‌తేడాది న‌వంబ‌ర్ లో 30కిలో మీట‌ర్లు అందుబాటులోకి వ‌చ్చినా.... 2018 ప్రారంభం నుండే మెట్రో ర‌ద్దీ భారీగా పెరిగింది. కారిడార్ వ‌న్ మియాపూర్ నుండి ఎల్బీ న‌గ‌ర్ వ‌ర‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావ‌డంతో మ‌రింత మంది సిటిజ‌న్స్ మెట్రో రైల్ ను ఆశ్రయిస్తున్నారు.

అమీర్ పేట్ నుండి మియాపూర్ వ‌ర‌కు ఏర్పాటు చేసిన 16 కిలో మీట‌ర్ల వరకు మెట్రో రైలు అక్టోబ‌ర్ లో సిటిజ‌న్స్ అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం రెండు కారిడార్ల‌లో 46కిలో మీట‌ర్ల మెట్రో మార్గంలో క‌మ‌ర్షియ‌ల్ యాక్టివిటి నిర్వ‌హిస్తున్నారు. సిటి సెంటర్ నుండి 29కిలో మీట‌ర్ల మేర ఒక వైపు నుండి మారో వైపుకు కేవ‌లం 52నిమిషాల్లో చేరుకుంటుండ‌టంతో ఈమార్గంలో మెట్రో ర‌ద్దీ భాగా పెరిగింది. రోడ్డు మార్గంలో వెళ్లితే ఎక్క‌డ ట్రాపిక్ జామ్ అవుతుందో ఎక్కడ ట్రాఫిక్ లో చిక్కుకుంటామో అర్థం కాని ప‌రిస్థితి. సాధారణంగా గంట45నిమిషాల నుండి రెండు గంట‌ల స‌మ‌యం కూడా ప్రయాణానికి పడుతుంది. నిత్యం ఈ మార్గంలో ప్ర‌యాణించే వారంతా మెట్రో రైలునే ఆశ్ర‌యిస్తున్నారు.

ఇక ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వ‌చ్చిన మార్గంలో సిటి సెంట్ర‌ల్ బ‌స్ స్టాండ్..., నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్లు ఉండ‌టంతో ర‌ద్దీ పెరగడానికి కార‌ణం అయ్యింది. ఎల్బీ న‌గ‌ర్ మియాపూర్ మార్గంలో ప్ర‌తి రోజూ ల‌క్ష‌కు పైగా ప్ర‌యాణీకులు త‌మ త‌మ గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటున్నారు. ప్రతి రోజు 550 ట్రిప్పులు తిరుగుతున్న మెట్రో రైళ్లు దాదాపు 13 వేల కిలోమీటర్లు రన్ చేస్తున్నాయి. 99.7శాతం సమయపాలన పాటిస్తూ... 99.9శాతం ట్రైన్ సర్వీస్ డెలివరీతో సేవలు అందిస్తుంది హైదరాబాద్ మెట్రో. మెట్రో రైల్ ప్రారంభమైన 154 రోజుల్లో కోటి మంది ప్రయాణికులను చేరవేసింది. 280రోజుల్లో 2 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చింది. న‌వంబ‌ర్ 15 నాటికి 351 రోజుల్లో 3 కోట్లమంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేశారు.

ఈ ఏడాది పెద్ద మొత్తంలో ప్రయాణికుల‌కు సేవ‌లు అందించిన మెట్రో రైల్ ను హైటెక్ సిటీ వరకు పరుగులు పెట్టించాల‌ని భావించినా సాధ్యంకాలేదు. మెట్రో మార్గాల్లో ఫుట్ పాత్ ల నిర్మాణంలోనూ మంచి పురోగ‌తిని సాధించారు మెట్రో అధికారులు. మెట్రో ప్రయాణానికే అంతా మొగ్గుచూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories