ఏక్‌ షామ్..బాబ్రీ కే నామ్... అసలు కథేంటి?

ఏక్‌ షామ్..బాబ్రీ కే నామ్... అసలు కథేంటి?
x
Highlights

రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణను, సుప్రీం కోర్టు వాయిదా వేస్తుండటాన్ని కొందరు కాషాయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. మందిరాన్ని...

రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణను, సుప్రీం కోర్టు వాయిదా వేస్తుండటాన్ని కొందరు కాషాయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. మందిరాన్ని వ్యతిరేకించే శక్తుల కుట్రగా అభివర్ణిస్తున్నారు. కావాలనే కొన్ని శక్తులు మందిరం ఇష్యూను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయని, కోర్టును తప్పుదారి పట్టిస్తున్నాయన్నట్టుగా వ్యాఖ్యానిస్తుండటం, దుమారం రేపుతోంది. ఎన్నికల్లోపు తీర్పు రాకుండా, ఒక ప్రణాళిక ప్రకారం వాయిదాల పర్వం జరుగుతోందని, ఆరెస్సెస్, వీహెచ్‌పీలకు చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీం కోర్టు ప్రస్తుత వాయిదాకు, జస్టిస్ లలిత్ తప్పుకోవడమేనని తెలిసినా, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. సుప్రీం కోర్టు వాయిదా దురదృష్టకరమని, ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని, ఆరెస్సెస్‌ లీడర్‌ ఇంద్రేష్ కుమార్ కామెంట్ చేశారు.

మరోవైపు అయోధ్యపై నెమ్మదిగా వేడి రగులుతున్న టైంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్‌ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏక్‌

షామ్..బాబ్రీ కే నామ్...అనే కార్యక్రమంలో మాట్లాడిన అయ్యర్...సరయూనదీ తీరంలోని దశరథుడు కోటలో వెయ్యి రూములున్నాయని, మరి రాముడు ఏ గదిలో జన్మించాడు. మణిశంకర్‌ అయ్యర్ వ్యాఖ్యలపై సహజంగానే బీజేపీ నేతలు మండిపడ్డారు. రామ మందిర నిర్మాణం కాంగ్రెస్‌కు ఇష్టంలేదని, అందుకు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే నిదర్శమని వ్యాఖ్యానించారు. మొత్తానికి సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేయడం, దానిపై కొందరు కాషాయనేతలు రాజకీయ వక్రభాష్యాలు చెప్పడం, దీనికి తోడు మణిశంకర్‌ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు, అయోధ్య వివాదానికి మళ్లీ ఆజ్యంపోస్తున్నాయి. వచ్చేనెల ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో, నరేంద్ర మోడీ సర్కారు మందిరం నిర్మాణంపై ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories