కీలకమైన నేతల డుమ్మాకు కారణమేంటి?

కీలకమైన నేతల డుమ్మాకు కారణమేంటి?
x
Highlights

ముందు మాయావతి సంగతి చూద్దాం. అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఎస్పీ అధినేత్రి. ఈమధ్యే యూపీలో ఎస్పీతో ఫ్రంట్‌ కట్టారు. కోల్‌కతా సభకు అఖిలేష్ వచ్చారు కానీ, మాయావతి రాలేదు.

ముందు మాయావతి సంగతి చూద్దాం. అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఎస్పీ అధినేత్రి. ఈమధ్యే యూపీలో ఎస్పీతో ఫ్రంట్‌ కట్టారు. కోల్‌కతా సభకు అఖిలేష్ వచ్చారు కానీ, మాయావతి రాలేదు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుగా, మమతాలాగే ప్రధాని పదవి ఆశిస్తున్న మాయావతి, ఎందుకు వెళ్లడం అని లక్నోలోనే ఉండిపోయారు. ఒకరకంగా మమతా నాయకత్వానికి నో చెప్పారు.

రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు. ఎవరు ఫ్రంట్‌ కట్టినా, దానికి నాయకత్వం వహించాల్సిన అతిపెద్ద పార్టీ నాయకుడైన రాహులే. కానీ ఈయనగారు కూడా రాలేదు. ఎందుకంటే, రాహుల్ నాయకత్వాన్ని మమత ఒప్పుకోవడంలేదు. రాబోయే కాలంలో, కాబోయే ప్రధాని రాహులేనంటూ, మొన్న చెన్నైలో స్టాలిన్ చెప్పడాన్ని హర్షించలేదు మమత. ఇప్పుడే చర్చించడం వేస్ట్‌ అన్నారు. అందుకే రాహుల్‌, ఈ సభకు రాలేదు. తన తరపున మల్లిఖార్జున ఖర్గేను పంపించారు. ప్రధాని పదవిపై ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.

ఇక గులాబీ బాస్ కేసీఆర్. గెలుపు ఊపులో ఉన్న కేసీఆర్‌ను రప్పించేందుకు, చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు మమత. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించడానికి మొదట కేసీఆర్‌ కలిసింది కూడా దీదీనే. కానీ కేసీఆర్ వెళ్లలేదు. ఆయనకుండే కారణాలు, ఆయనకున్నాయి మరి. ఎందుకంటే, మమత ఫ్రంట్‌లో కాంగ్రెస్‌ ఉంది. అది తెలంగాణలో టీఆర్ఎస‌కు ప్రత్యర్థి. అంతేకాదు, చంద్రబాబు కూడా ర్యాలీలో ఉన్నారు. అందుకే కేసీఆర్, కోల్‌కతా ర్యాలీకి వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది.

ఇక వైసీపీ అధినేత జగన్‌ కూడా, మమత సభకు అటెండ్ కాలేదు. ఆ ఫ్రంట్‌లో, తన ప్రత్యర్థి చంద్రబాబు ఉన్నారు. అందుకే వెళ్లలేదు జగన్.

సీపీఎం కూడా మమత సభకు వెళ్లలేదు. ఎందుకంటే, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థి సీపీఎం. ఇక ఒడిషా సీఎం, బిజూ జనతాదల్‌ అధినేత నవీన్ పట్నాయక్‌ కూడా, మమత సభకు వెళ్లలేదు. ఇక మోడీని అప్పుడప్పుడు తిట్టే, బీజేపీ మిత్రపక్షాలైన శివసేన, అకాలీదల్‌ కూడా, మమత ర్యాలీకి అటెండ్ కాలేదు. ఎవరి కారణాలు వారివే. ఎవరి ఆశలు వారివే. ఎవరి వ్యూహాలు వారివే.

Show Full Article
Print Article
Next Story
More Stories