కొండపల్లికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు

కొండపల్లికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు
x
Highlights

కృష్ణా జిల్లా కొండపల్లికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు రాబోయే...

కృష్ణా జిల్లా కొండపల్లికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో కొండపల్లి కోట అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వందకోట్లతో కొండపల్లిని పర్యాయటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

తెలుగు తనానికి కొండపల్లి ఒక బ్రాండ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొండపల్లి అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కొండపల్లి బొమ్మలు గుర్తుకు వస్తాయన్నారు. విజయవాడ సమీపంలోని కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల నాణ్యత, సౌందర్యం అద్భుతంగా ఉంటుందని ఎంతో ఏకాగ్రతతో చేస్తే తప్ప సాధ్యం కాదన్నారు. ప్రతి బొమ్మకు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. అవసరమైతే ఇక్కడ పొణికి చెట్లను పెంచేందుకు నిధులు వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. కొండచుట్టూ కనిపిస్తున్న ప్రాకారం త్రిలింగ దేశ వైభవానికి నిదర్శనమన్నారు చంద్రబాబు.

కొండపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. 10 కోట్లకు పైగా నిధులు ఖర్చి చేశామన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో వంద కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కొండపల్లి కోట అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతికి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వస్తారని చంద్రబాబు చెప్పారు.

కోటద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు తిలకించారు. కొండపల్లి దర్బార్ హాలు, గ్యాలరీని సందర్శించారు. త్రీ డీ ప్రొజెక్షన్‌ మాపింగ్‌ ప్రారంభించారు. చంద్రబాబు వెంట మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు, పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories