ఆధ్యాత్మిక పురోగతికి సాధనం.. యాగం

ఆధ్యాత్మిక పురోగతికి సాధనం.. యాగం
x
Highlights

సనాతన ధర్మంలో యజ్ఞయాగాదులకు ప్రత్యేక స్థానం ఉంది. సమాజహితానికి, లోకకల్యాణానికి అవి చాలా విశేషమైనవి కూడా. యజ దేవ పూజాయాం అన్న శబ్ద నుంచి ఉద్బవించిన...

సనాతన ధర్మంలో యజ్ఞయాగాదులకు ప్రత్యేక స్థానం ఉంది. సమాజహితానికి, లోకకల్యాణానికి అవి చాలా విశేషమైనవి కూడా. యజ దేవ పూజాయాం అన్న శబ్ద నుంచి ఉద్బవించిన యజ్ఞానికి సరైన అర్థం దైవపూజే. యాగాలు, యజ్ఞాల వల్ల స్వార్థం నశిస్తుందని ప్రగాఢంగా విశ్వసించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... మరో జగత్కల్యాణానికి అంకురార్పణ చేశారు. మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగంతో బృహత్‌క్రతువుకు శ్రీకారం చుట్టారు.

తనకు దైవభక్తి, యజ్ఞయాగాదులపై నమ్మకం ఎక్కువేనని

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పుకుంటారు. అంతేకాదు... వాటిని ఆచరించి చూపిస్తారు కూడా. భక్తి విషయంలో సమకాలీన రాజకీయ నాయకుల్లో కేసీఆర్‌ను మించిన పొలిటికల్‌ లీడర్‌ ఉండ‌రేమో. అందుకే కేసీఆర్ ఏ యాగం నిర్వహంచినా అది చ‌ర్చకు తావిస్తుంది.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ యాగాలపై చర్చతో పాటు... వాటి విశిష్టత కూడా అందరికీ తెలుస్తుంది. కాని ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచీ యాగాలు చేయ‌డం కేసీఆర్‌కు అల‌వాటు. రెండు దశాబ్దాలకుపైగానే ఈ క్రతువు నిర్వహిస్తున్న కేసీఆర్‌ తొలిసారి 1996లో సిద్దిపేట‌లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు.... సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు నిర్వహించారు. 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహననం జరిపారు. 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం చేశారు. 2006లో స‌హ‌స్ర చండీయాగం, 2007లో పాల‌కుర్తి న‌ర‌సింహ రామ‌శ‌ర్మ సిద్దాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుద‌ర్శన యాగాలు నిర్వహించారు. ఇక 2008లో సిద్దిపేట కోటిలింగాల దేవాల‌యంలో గాయ‌త్రీ యాగం, 2009లో తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం, 2010లో ఇదే తెలంగాణ భ‌వ‌న్‌లో చండీ యాగం చేశారు. 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగం, 2015 నవంబర్ 27న నవ చండీయాగం, 2015 డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శత చండీయాగం, 2018 రాజశ్యామల యాగం నిర్వహించిన రాష్ట్రాధినేత ఇప్పుడు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం జరుపుతున్నారు.

2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 డిసెంబర్ 23 నుంచి 27వరకు ఆయుత శతచండీయాగాన్ని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఎర్రవ‌ల్లిలోని త‌న వ్యవ‌సాయ‌క్షేత్రంలో నిర్వహించారు. ఈ యాగానికి ప్రాంతీయా, జాతీయ స్థాయిలో రాజ‌కీయ నేత‌ల‌ను రప్పించడమే కాకుండా అప్పటి రాష్ట్రప‌తి ప్రణ‌బ్ ముఖర్జీని యాగా పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. కేసీఆర్‌ నిర్వహించిన ఆయుత చండీయాగం జాతీయ స్థాయిలో చ‌ర్చనీయాంశమైంది. కలియుగంలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర, అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. గత 200 ఏళ్లలో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే.. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories