కాశీలో.. విశ్వేశ్వరుడి కరుణ ఎవరిపైనా?

కాశీలో.. విశ్వేశ్వరుడి కరుణ ఎవరిపైనా?
x
Highlights

నరేంద్ర మోడీ బరిలో నిలిచిన వారణాసిలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. రైతులు, బీఎస్ ఎఫ్ ఆర్మీ జవాన్ నామినేషన్ లను ఈసీ చెల్లవని తోసిపుచ్చడంపై వారు ఎదురు...

నరేంద్ర మోడీ బరిలో నిలిచిన వారణాసిలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. రైతులు, బీఎస్ ఎఫ్ ఆర్మీ జవాన్ నామినేషన్ లను ఈసీ చెల్లవని తోసిపుచ్చడంపై వారు ఎదురు తిరుగుతున్నారు. ఈసీ ఉద్దేశపూర్వకంగా తమను పోటీ నుంచి పంపేస్తోందని ఆరోపిస్తుంటే.. ఎక్కువ నామినేషన్లు పెరిగితే ఈవీఎంలో బ్యాలెట్ పేపర్ కష్టమవుతుందని ఈసీ టెన్షన్ పడుతోంది. వారణాసి లో పోలింగ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. మోడీపై పోటీకి బరిలోకి దిగిన వారికి అక్కడి ఎన్నికల కమిషన్, స్థానిక బీజేపీ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ బ్యూరో చుక్కలు చూపించింది. బల్క్ నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డు పడుతోంది. తెలంగాణ నుంచి నామినేషన్లు వేద్దామని వెళ్లిన రైతులకు నానా అడ్డంకులు కల్పించారు అధికారులు. మొత్తం 54 మంది రైతులు నామినేషన్లు వేయడానికి వెడితే 35 మందిని మాత్రమే అనుమతిస్తామని ఈసీ తెేల్చి చెప్పింది. వారిలోనూ 25 మందివి మాత్రమే పరిశీలనకు తీసుకుని అందులో సరైన పత్రాలు లేవంటూ 24 మందివి తిరస్కరించింది. ఒకే ఒక్కరి నామినేషన్ మాత్రం స్వీకరించింది. ఈసీ వైఖరిపై మండి పడుతున్న తెలంగాణ రైతులు దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు సమాజ్ వాదీ పార్టీ ది కూడా అదే పరిస్థితి. ఆ పార్టీ మొదట శాలినీ యాదవ్ ను బరిలోకి దింపింది. కానీ బీఎస్ ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో సమాజ్ వాదీ పార్టీ వ్యూహాత్మకంగా తేజ్ బహదూర్ కు మద్దతు పలికి తమ అభ్యర్ధిని ఉపసంహరించింది.తేజ్ బహదూర్ సమాజ్ వాదీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అయితే కుంటి సాకులు చెబుతూ .. సమర్పించిన కాగితాలు సరిపోవంటూ ఆయన నామినేషన్ ను ఈసీ కొట్టేసింది.దాంతో సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటానంటున్నారు తేజ్ బహదూర్.. తేజ్ బహదూర్ నామినేషన్ తిరస్కారానికి గురవడంతో సమాజ్ వాదీ పార్టీ మళ్లీ శాలినీ యాదవ్ నే రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తం మీద వారణాసిలో పోటీకి బీజేపీ భయపడుతోందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories