Top
logo

పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధం

పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధం
Highlights

తెలంగాణలో పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధమైంది. పోలింగ్ నుంచి ఫలితాల వరకు అన్నీ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధమైంది. పోలింగ్ నుంచి ఫలితాల వరకు అన్నీ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ అండ్ కౌంటింగ్‌‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తొలి విడత ఎన్నికల ఏర్పాట్లపై HMTV ప్రత్యేక కథనం.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో 153 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 50 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఈనెల 21న 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక మంచిర్యాల జిల్లాలో 111 గ్రామాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, 8 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 108 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆసిఫాబాద్‌ జిల్లాలో 113 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 18 ఏకగ్రీమయ్యాయి. మిగిలిన 98 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో 134 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు పెట్టనున్నారు. ఇక వెబ్‌‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షించనున్నారు. అలాగే పోలింగ్ జరుగుతున్న తీరును వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఫలితాలు ప్రకటించే సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

Next Story