ఓట్ల వేటలో హద్దులు మీరిన నేతలలకు ఈసీ స్ట్రాంగ్ కొటింగ్..

ఓట్ల వేటలో హద్దులు మీరిన నేతలలకు ఈసీ స్ట్రాంగ్ కొటింగ్..
x
Highlights

యూపీలో నేతలు చెలరేగిపోతున్నారు. ఎన్నికల కోడ్ లు వారిని ఏ మాత్రం ఆపలేకపోతున్నాయి.. ఓట్ల వేటలో హద్దులు మీరుతున్నారు. ఇష్టాను సారం కామెంట్లు...

యూపీలో నేతలు చెలరేగిపోతున్నారు. ఎన్నికల కోడ్ లు వారిని ఏ మాత్రం ఆపలేకపోతున్నాయి.. ఓట్ల వేటలో హద్దులు మీరుతున్నారు. ఇష్టాను సారం కామెంట్లు చేసేస్తున్నారు. ఆలీ, బలీ అంటూ మతం పేరుతో యోగీ, మాయా ఢిష్యుం ఢిష్యుం అనడంతో ఈసీ రంగంలోకి దిగింది. ఇద్దరి నోళ్లూ రెండు రోజుల పాటూ మూత పడేలా చేసింది.

దశల వారీగా జరుగుతున్న 2019 సార్వత్రిక ఎన్నికలు యూపీలో పార్టీల నేతలు కట్టు తప్పేలా చేస్తున్నాయి. ఓటర్ల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. యుద్ధభూమి యూపీలో గెలుపు కోసం అన్ని పార్టీలూ ప్రచారంతో హోరెతతిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఒక్కో సారి శృతి మించుతున్నాయి. దాంతో ఈసీ కొరడా ఝుళిపిస్తోంది.మతం పేరుతో హద్దులు మీరి కామెంట్లు చేస్తున్న నేతలపై నిషేధం విధించి ఈసీ తన పవర్ చూపించింది. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర వ్యాఖ్యలుచేయడంపై ఈసీ సీరియస్ అయింది. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతిపైనా చర్యలకు ఆదేశించింది. యోగీ, మాయా ఇద్దరూ ఎన్నికల ప్రచార సభల్లో చెలరేగిపోతున్నారు.

యోగీ పాల్గొన్న ఒక సభలో ముస్లింలు, మైనారిటీ ఓట్లను ఉద్దేశించి మీకు ఆలీ ఉంటే మాకు బజరంగ్ బలీ ఉన్నారంటూ రెచ్చగొట్టారు. యోగీ చేసిన ఈ కామెంట్ ఆలీ వర్సెస్ బలీ అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల 9న యోగీ ఓ సభలో ఇలా వార్నింగ్ ఇవ్వగానే మాయావతి అలా రెచ్చిపోయారు ఆలీ, బజరంగ్ బలీ ఇద్దరూ తమవారేనని యోగీ ఇది తెలుసుకోవాలనీ కౌంటరిచ్చారు. ఇస్లాంలో ఆలీ అన్న పదం బాగ ఫేమస్ కాగా బజరంగ్ బలీ అంటే హనుమాన్ అని అర్ధం. ఈ రెండు వర్గాల ఓటర్లు తమవైపే ఉన్నారనడం ద్వారా మాయావతి ఘాటుగా రియాక్టయ్యారు.

నేతలిద్దరూ ఇలా హద్దులు మీరి సవాళ్లు విసురుకోవడం గమనించిన సుప్రీం కోర్టు సుమోటోగా వారిపై చర్యలకు ఆదేశించింది. యోగీ, మాయాల అలా చెలరేగుతుంటే స్పందించని ఈసీపైనా చురకలేసింది. ఈసీ పేపర్ టైగర్ గా మారిందని కామెంట్ చేసింది. దాంతో ఎన్నికల కమిషన్ ఇద్దరిపైనా నిషేధం విధించింది.కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ యోగీపై మూడు రోజులు, మాయావతి పై రెండు రోజుల నిషేధం విధించింది. ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని ఇద్దరినీ ఈసీ మందలించింది.వీరిద్దరూ ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.ఎన్నికల ప్రచారంలో ప్రతీ క్షణమూ విలువైనదే.. ఈసీ ఆదేశాలతో వీరిద్దరినోళ్లూ రెండు రోజుల పాటూ మూతపడ్డాయి.

మరోవైపు యూపీ సుల్తాన్ పూర్ ఎన్నికల సభలలో మేనకాగాంధీ చేస్తున్న ప్రసంగాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముస్లింలు పనులు జరగాలనుకుంటే మర్యాదగా తనకు ఓటేయాలని రెండు రోజుల క్రితం ఓపెన్ గా చెప్పేసిన మేనక ఇవాళ మరో అడుగు ముందుకేశారు. మైనారిటీలంతా తనకే ఓటు వేయాలంటూ కొన్ని షరతులు పెట్టారు. ఓటింగ్ సరళిని బట్టి గ్రామాల ప్రాధాన్యత ఉంటుందన్నారు. 80 శాతం బీజేపీకి ఓట్లేసిన గ్రామాలను కేటగిరీ ఏ కింద, 60 శాతం ఓటేసిన గ్రామాలను బీ కేటగిరీ కింద, 50 శాతం ఓటేసిన గ్రామాన్ని సీ కేటగిరీ కింద పరిగణిస్తానని బాహాటంగా చెప్పారు. 30 శాతం ఓటేస్తే అది అస్సలు ప్రాధాన్యత లేని డీ కేటగిరీ గ్రామమవుతుందని మేనక చెబుతున్నారు. మొన్నటి వరకూ ముస్లింలు తనకు ఓటేయాలని బాహాటంగా డిమాండ్ చేసిన మేనక ఈసీ అక్షింతలు వేసినా వెనక్కు తగ్గడం లేదు. ఇవాళ ఓట్లను బట్టి గ్రామాల ప్రాధాన్యతలుంటాయని, ఓటు వేయని గ్రామస్తులు పనుల కోసం వస్తే.. తాను పట్టించుకోననీ బహిరంగంగా చెప్పేస్తున్నారు.పార్టీల ప్రలోభాల పర్వానికి, వార్నింగులకీ యూపీ ఓటర్లు షాక్ తింటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories